అభిప్రాయ బేధాలు రావడం సహజం.. కోపం వస్తే ఒక మాట అంటారు.. లేదా ఒక దెబ్బ కొడతారు.. బేధాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవడానికి ట్రై చేస్తారు. అయితే ఇవన్నీ పోలాల్లో గెట్ల మధ్య తగాదాలు ఉంటేనో, లేక నీటి వాడుక విషయంలోనే ఉంటాయి. అయితే కుళ్లు , కుట్ర, కుతంత్రాలు మనిషి మనసులో మొదలైన పర్యావసానం దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పంట బాగా పండిందనో లేక పాత కక్షలు ఉన్నాయో తెలియదు కానీ… పత్తికొండకు చెందిన హుసేన్ 5 ఎకరాల పొలంలో సాగు చేసిన వేరుశనగ పంటకు రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో వేరుశనగ పంట పూర్తిగా కాలి పోయింది. రైతుకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది.
తెల్లారి రైతు పొలంలోకి వెళ్లి చూసేసరికే పంట మొత్తం కాలిపోయి ఉంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఉంటారని స్థానిక రైతులు భావిస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం