Viral Video: జర ఆగు కాక.. శోభనానికి ముహూర్తం వేరే ఉంది.. ఏందీ దూకుడు
లవ్ చేసుకున్న కపుల్ పెళ్లి చేసుకుంటే.. తొలినాళ్లలో వారు కలిసి ఉండేందుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ముందు నుంచే వారి మధ్య సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి.
లవ్ చేసుకున్న కపుల్ పెళ్లి చేసుకుంటే.. తొలినాళ్లలో వారు కలిసి ఉండేందుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ముందు నుంచే వారి మధ్య సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి. పెద్దలు కుదిర్చిన వివాహాలు అయితే మాత్రం నూతన వధూవరులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు.. చూసుకునేందుకు కాస్త బిడియం ఉంటుంది. అయితే ఇవన్నీ పాత రోజుల్లో.. ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌లోనే రొమాన్స్ మొదలెట్టేస్తున్నారు కపుల్స్. కొందరైతే పెళ్లి మండపంలో కూడా రెచ్చిపోతున్నారు. యస్.. తాజాగా అలాంటి వీడియోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హిందూ ఆచారం ప్రకారం జరుగుతున్న ఓ పెళ్లిలో వరుడు వధువుని ముద్దు పెట్టుకున్నాడు. డీప్ లిప్ లాక్‌తో రచ్చ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
వీడియోలో..మండపంపై పెళ్లి వేడుక జరుగుతుండగా.. అక్కడే ఉన్న అతిథులు వధువుని ముద్దు పెట్టుకోవాలని వరుడికి సరదాగా సూచిస్తారు. అయితే ఆ విషయాన్ని వరుడు సీరియస్‌గా తీసుకున్నాడు. చుట్టూ కుటుంబ సభ్యులు, అతిథులు ఉన్నప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా వరుడు, వధువు ముఖాన్ని దగ్గరకు తీసుకొని పెదవులపై ముద్దాడాడు. వధువు కూడా వరుడు వద్దకు జరిగి అతని భుజంపై చేతులు వేసి.. ముద్దు పెట్టేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. ఇదేం పద్దతని కొందరు ప్రశ్నిస్తుండగా.. ఇలాంటివి ఇప్పుడు కామన్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రేజీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
Also Read: పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి
వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం