4ఏళ్ల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!

మైనర్ బాలికను హోంగార్డ్ 5నెలల గర్భవతిని చేసిన ఘటన మరవక ముందే ఏపీలోని మచిలీపట్నంలో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు సంవత్సరాల చిన్నారిపై మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. రాడార్ కేంద్రం సమీపంలోని ఓ కాలనీలో ఈ

4ఏళ్ల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 24, 2020 | 3:34 PM

మైనర్ బాలికను హోంగార్డ్ 5నెలల గర్భవతిని చేసిన ఘటన మరవక ముందే ఏపీలోని మచిలీపట్నంలో మరో దారుణం జరిగింది. నాలుగు సంవత్సరాల చిన్నారిపై మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. రాడార్ కేంద్రం సమీపంలోని ఓ కాలనీలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఘటనపై జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ట్రైనీ డీఎస్పీ పి. శ్రావణిని నియమించారు. దీంతో వారు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ ఘటనను బయటకు రానివ్వకుండా నిందితుడి కుటుంబసభ్యులు అడ్డుకున్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.