Ramatheertham: రామతీర్థం ఆలయం పునర్నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

Ramatheertham: రామతీర్థం ఆలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

Ramatheertham: రామతీర్థం ఆలయం పునర్నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 23, 2021 | 12:03 PM

Ramatheertham: రామతీర్థం ఆలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం నాడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారం దర్శనం అనంతరం తిరుమల దేవస్థానం వద్ద మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలో ప్రతిష్ఠించబోయే విగ్రహాలను టీటీడీ నుంచి తరలించామని చెప్పారు.

రామతీర్థం క్షేత్రంలోని రామాలయాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆలయ పనులు పూర్తయ్యే వరకు విగ్రహాలను బాలాలయంలోనే ప్రతిష్ఠిస్తామని ఆయన చెప్పారు. సంవత్సరంలోపు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు.

Also read:

MS Narayana Death Anniversary: ఐదు నందులు అందుకున్న నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ వర్ధంతి నేడు

ఏడేళ్లకు మందు తర్వాత తెలంగాణ ఎలా ఉందో ఆలోచించండి.. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి