Seediri Appalaraju: ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. రైతులతో మంత్రి అప్పలరాజు భేటీ.. 

ఆక్వా రంగంలో ప్రతిష్టంభనలకు విదేశీ మార్కెట్‌లో ఒడిదుడుకులే కారణమని చెప్పారు మంత్రి సిదిరి అప్పలరాజు. ఆక్వా రైతులతో మంత్రి సిదిరి అప్పలరాజు గురువారం విజయవాడలో భేటీ అయ్యారు.

Seediri Appalaraju: ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. రైతులతో మంత్రి అప్పలరాజు భేటీ.. 
Seediri Appalaraju

Updated on: Nov 11, 2022 | 5:47 AM

ఆక్వా రంగంలో ప్రతిష్టంభనలకు విదేశీ మార్కెట్‌లో ఒడిదుడుకులే కారణమని చెప్పారు మంత్రి సిదిరి అప్పలరాజు. ఆక్వా రైతులతో మంత్రి సిదిరి అప్పలరాజు గురువారం విజయవాడలో భేటీ అయ్యారు. ఆక్వా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు, ఆక్వా కంపెనీలకు సమన్వయం కుదిరేలా రేటు నిర్ణయించామని మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు. ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైసీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు మంత్రి సిదిరి. ఆక్వా రంగంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్‌కు ఫుల్‌ స్టాప్‌ పడేలా కేంద్రంతో కూడా చర్చించి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మరోవైపు ఆక్వారంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. క్రాప్ హాలిడే దిశగా ఆక్వా రంగం సాగుతోందంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా రైతులు, వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఎక్స్‌పోర్ట్స్‌లేకపోవడం.. డిమాండ్ తక్కువగా ఉండటంతో.. ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో ఆందోళన చెందుతున్నారు రైతులు. చైనా, అమెరికా, యూరప్ దేశాలు ఆక్వా ఎగుమతులను నిలిపివేయడంతో నెల రోజులుగా కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. క్వాలిటీ సరిగా లేవంటూ కొన్ని కంటైనర్లు వెనక్కి కూడా వచ్చేశాయంటున్నారు.

రోజుకు 300 టన్నుల ఎక్స్‌పోర్ట్ జరిగే కోనసీమ నుండి ఇప్పుడు 5 టన్నులు కూడా వెళ్ళని పరిస్థితి నెలకొంది. ఆక్వా ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా కోనసీమ, అమలాపురం, ముమ్మిడివరంలో రైతుల దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్‌పోర్ట్స్‌ లేకపోవడంతో తీవ్ర నష్టాలు తప్పవనే భావనలో ఆక్వారైతులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..