Minister Roja: ఆంధ్రప్రదేశ్ లో(Andhra Pradesh) టెన్త్ క్లాస్ విద్యార్థులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి రోజా ఫైరయ్యారు. . శనివారం ఆమె తిరుమలలో (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రోజా.. ఆంధ్రప్రదేశ్ కంటే చాలా రాష్ట్రాల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, అక్కడ ప్రతిపక్షాలు ఇక్కడి లాగా విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయట్లేదని తెలిపారు. మహానాడులో తొడగోట్టి రమ్మని పిలిచిన టీడీపీ నేతలు.. జూమ్ మీటింగ్ కు కొడాలి నాని, వంశీ వస్తే లోకేశ్ ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. లోకేష్‌కు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం ఎప్పటికీ రాదని జోస్యం చెప్పారు రోజా. కరోనా వైరస్ వలన స్కూళ్లు నడవకపోవడం.. విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం వల్ల ఫెయిలయ్యారని మంత్రి రోజా చెప్పారు. దీనిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు బస్సు యాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. జనసేన పెట్టింది పార్టీ కార్యకర్తల కోసమా.. జనం కోసమా అనే స్పష్టత లేదని అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం. అందుకే పార్టీ మూసేస్తా అంటున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..