Minister Roja: సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ కు అదే తేడా.. మరోసారి జనసేనానిపై మంత్రి రోజా ఫైర్..

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రోజు రోజుకు దిగజారిపోతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్ అయితే...

Minister Roja: సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ కు అదే తేడా.. మరోసారి జనసేనానిపై మంత్రి రోజా ఫైర్..
Minister Roja
Follow us

|

Updated on: Nov 03, 2022 | 3:29 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రోజు రోజుకు దిగజారిపోతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్ అయితే.. లక్ష్యం లేకుండా ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్‌ అని ఆరోపించారు. చదువు ఒక్కటే ముఖ్యం కాదని, క్రీడలు కూడా ముఖ్యమేనని అన్నారు. కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా, ఎంత మంది నిందించినా విజయం ద్వారా సమాధానం చెప్పాలని మంత్రి రోజా సూచించారు. తాను ఎన్నో అవమానాలు ఎదురైనా వెనుదిరగకుండా ముందుకు వెళ్లానని, మన లక్ష్యం సెక్సెస్‌పై మాత్రమే ఉండాలని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్ చూసినన్ని అవమానాలు ఇంకెవరూ చూసి ఉండరన్న మంత్రి.. 151 సీట్లల్లో గెలుపు సాధించి అందరికీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. హ్యాండ్ బాల్ ఆడే యువకులకు శాప్ తరుపున అన్నివిధాల శిక్షణ ఇస్తున్నామని మంత్రి రోజా చెప్పారు. కష్టపడుతున్న ఆటగాళ్లకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందని మంత్రి తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్ పుట్టినరోజు సందర్భంగా ‘జగనన్న క్రీడా సంబరాలు’ పేరుతో రూ.50 లక్షల నగదు బహుమతితో క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. క్రీడాకారులు పట్టుదలతో నేషనల్ నుంచి ఒలింపిక్స్ వరకు వెళ్లాలని మంత్రి రోజా ఆకాంక్షించారు. అలాంటప్పుడే ఉద్యోగ, ఆర్థికంగా పరిస్థితులు బాగుంటాయని చెప్పారు. కాగా.. గతంలోనూ పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర ప్రజల వలసలు పవన్ కళ్యాణ్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. మూడు రాజధానులపై ప్రాంతీయ విద్వేషాలనుు రెచ్చగొట్టేవిధంగా వ్యవహిరిస్తున్నారని మండిపడ్డారు.

29 గ్రామాల అభివృద్ధి కోసం 26 జిల్లాల అభివృద్ధిని విస్మరించడం కరెక్టేనా. టీడీపీ పాలనలో అమరావతి ఎందుకు అభివృద్ధి కాలేదు. ప్రజలను రెచ్చగొట్టేందుకే పాదయాత్రలు చేస్తున్నారు. రైతుల పాదయాత్రలో తొడలు గొట్టి.. మీసాలు దువ్వుతూ టీడీపీ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారు. పాలనా వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

     – మంత్రి రోజా కామెంట్స్ (గతంలో చేసినవి)

మరిన్ని ఏపీ వార్తల కోసం..