Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagababu vs Roja: గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన.. నాగబాబుకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన మంత్రి రోజా

జబర్దస్త్ షోలో పక్కపక్కనే కూర్చొని ఒకరిపై ఒకరు కామెడీ పంచులు, జోకులు వేసుకున్నారు మంత్రి రోజా, నటుడు నాగబాబు. అలా జడ్జీలుగా కొనసాగుతూ చాలా ఏళ్ల పాటు కామెడీషో ను రక్తికట్టించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయయాయి.

Nagababu vs Roja: గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన.. నాగబాబుకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన మంత్రి రోజా
Rk Roja, Nagababu
Follow us
Basha Shek

|

Updated on: Feb 12, 2023 | 5:28 PM

జబర్దస్త్ షోలో పక్కపక్కనే కూర్చొని ఒకరిపై ఒకరు కామెడీ పంచులు, జోకులు వేసుకున్నారు మంత్రి రోజా, నటుడు నాగబాబు. అలా జడ్జీలుగా కొనసాగుతూ చాలా ఏళ్ల పాటు కామెడీషో ను రక్తికట్టించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయయాయి. రాజకీయాల పరంగా ఒకరికి ఒకరు బద్ధశత్రువులుగా మారిపోయారు. సోషల్‌ మీడియా వేదికగా ఒకరిని ఒకరు తిట్టిపోసుకుంటున్నారు. పరుష పదజాలంతో కౌంటర్లు, సైటేర్లు వేసుకుంటూ వార్తల్లో నిలుస్తారు. ఇటీవల తన నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం బీజీ కండ్రిగ, ఎంసీ కండ్రిగ గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రూ.11 లక్షలు నిధులు కేటాయించారు. వాటితో గ్రామాల్లో తాగునీటి బోరు, పైపులైన్లకు మంత్రి రోజా పూజ చేసి ప్రారంభించారు. గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఆత్మసంతృప్తి కలిగించిందంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను మంత్రి రోజా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. అయితే వీటిపై జనసేన నేత సెటైరికల్‌గా స్పందించారు. ‘ హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన రోజా..చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా!. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం’ అని ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్రాలు సంధించారు.

తాజాగా ఈ ట్వీట్‌కు స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చారు రోజా. ‘ఆ గ్రామ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ నీటి కోసమే ఎదురుచూస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ లాగి తాగునీటికి ఇచ్చాం నాగబాబు. గాడిదకి ఏం తెలుసు గంధపువాసన, నేను కాబట్టి ఇదిగో వివరాలు చూపిస్తున్నా. అదే ఆ గ్రామానికి వెళ్లి వెటకారం మాటలు మాట్లాడి చూడు తగిన రీతిలో చెప్తారు గుణపాఠం’ అని కౌంటర్ ఇస్తూనే కొన్ని వివరాలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం నాగబాబు, రోజాల మధ్య సాగుతున్న ట్విట్టర్‌ వార్‌ ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..  క్లిక్ చేయండి