Minister Roja on Chandarababu: ప్రతిపక్ష నేతలపై మంత్రి మంత్రి ఆర్ కే రోజా మళ్లీ విరుచుకుపడ్డారు. తమ అధినేత చంద్రబాబు అసెంబ్లీ కి రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. డేటా చౌర్యం కేసులో చంద్రబాబు పేరు బయట పడుతుందని సభకు రావడంలేదంటూ ఆరోపించారు మంత్రి రోజా. డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కన్నా డేంజర్ అంటూ.. 30 లక్షల మంది ఓటర్లను సేవా మిత్ర యాప్ ద్వారా తీసేయాలి చూసారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారని.. అంతేకాదు.. ప్రతి పక్ష నేతల డేటా దొంగలించి వారిని భయపెట్టి వారి పార్టీలో చేర్చుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి రోజా.
పిల్లలు బడికి దూరం కాకూడదాని ఆలోచనతో సీఎం జగన్ అమ్మవడి పథకాన్ని తీసుకొచ్చారు.. ఇప్పుడు 44లక్షల మంది పిల్లల తల్లులు ఖాతాల్లో జగన్ డబ్బులు వేశారని గుర్తు చేశారు. అసలు చంద్రబాబు కి సొంత పథకం లేదన్నారు. తాను మంత్రిగా పదవిలో ఉన్న సమయంలో ఎప్పుడు హోమ్ లో ఉన్న హోంమంత్రి ఇప్పుడు ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో గోల చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కనుక తెలుగు దేశం పార్టీ నాయకులు ఇకనైనా వారి తీరు మార్చుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు చూస్తారంటూ హెచ్చరించారు.
అంతేకాదు.. తన మీద కామెంట్లు చేసేవారు నగరిలో తన ఇంటికి వచ్చి మాట్లాడాలంటూ ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు మంత్రి రోజా. షూటింగ్ లేని సమయాల్లో ప్యాకేజీ స్టార్ వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతాడు.. అసలు ఆకాశాన్ని చూసి ఊమ్ము వేస్తే వారి మీదే పడుతుందన్నారు రోజా.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..