Watch Video: తీవ్ర కోపంతో పోలీసులపై విరుచుకుపడిన ఏపీ మంత్రి పేర్ని నాని.. ఎందుకంటే..?

|

Mar 04, 2022 | 6:37 PM

AP News: ఎప్పుడూ సౌమ్యంగా, ఒద్దికగా ఉండే ఏపీ మంత్రి పేర్ని నానికి కోపం వచ్చింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు మినిస్టర్. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి

Watch Video: తీవ్ర కోపంతో పోలీసులపై విరుచుకుపడిన ఏపీ మంత్రి పేర్ని నాని.. ఎందుకంటే..?
Perni Nani
Follow us on

Andhra Pradesh: ఎప్పుడూ సౌమ్యంగా, ఒద్దికగా ఉండే ఏపీ మంత్రి పేర్ని నాని(Perni Nani)కి కోపం వచ్చింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు మినిస్టర్.  పోలవరం(Polavaram) ప్రాజెక్టు వద్ద  పోలీసులు ఆయన కారును పక్కకు తీయమని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న నాని కారును అక్కడ నుంచి తీయాలని పోలీసులు సూచించారు. అంతే మంత్రిగారికి కోపం వచ్చింది. నా కారు తియ్యమన్నది ఎవరు అంటూ ఓ రేంజ్‌లో క్లాస్‌ పీకారు. అక్కడే మరికొన్ని కార్లు పార్క్ చేసి ఉండడంతో అవన్నీ ఎవరి కార్లు అంటూ నిలదీశారు. యస్ పీ, డీఐజీ కార్లు అంటూ పోలీసులు బదులివ్వడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా.. నేను ఇన్ ఛార్జ్ మంత్రిని అంటూ చెడా మడా తిట్టేశారు. ఇక్కడితో పండుగ అయిపోలేదంటూ విరుచుకుపడ్డారు. డిసిగ్నేషన్లు తక్కువ అయినవారి వాహనాలు అక్కడే ఉంచి.. నా కారు తీయమంటవా అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఎదురుగా ఉన్న పోలీస్ అధికారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. మంత్రి అతని మాటలు పట్టించుకోకుండా మాటలతో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, సీఎం జగన్ పోలవరం పర్యటనలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

 

Also Read: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..