Andhra News: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. ప్రజలు స్వేచ్ఛగా తిరగాలనే  కారంణానే ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని మంత్రి గొట్టిపాటి అన్నారు.

Andhra News: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!
Gottipati Ravi Kumar

Updated on: May 12, 2025 | 1:49 PM

ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్‌ చార్జీలు పెంచే ఆలోచన లేదని.. విద్యుత్‌ చార్జీలను పెంచకూడదనే విషయంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో పాలకులు విద్యుత్ వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను శుభ్రం చేయడానినే తమకు సమయం సరిపోతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా వాడుకుందని ఆయన రోపించారు. యాక్సిస్ ఎనర్జీ యూనిట్‌కు రూ.5.12లకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని సవరించి రూ.4.60లకే యూనిట్ విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని ఆయన అన్నారు. ప్రజలపై ఎక్కవ భారం పడకుండా.. వారికి తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రెన్యువబుల్ ఎనర్జీకి పెద్దపీట వేశామని మంత్రి అన్నారు. రాయలసీమ ప్రాంతం రెన్యువబుల్ ఎనర్జీకి అనుకూలంగా ఉంటే ప్రాంతం అని.. 2014-19లో రెనోవబుల్ ఎనర్జీ ద్వారా 7 వేల మెగావాట్ల ఉత్పత్తిని చేసి చూపించాంమని ఆయన తెలిపారు. తప్పు చేసిన వారికే రెడ్‌ బుక్‌ వర్తిస్తుందని.. వారు కచ్చితంగా శిక్షను అనుభవిస్తారని ఆయన అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. ప్రజలు స్వేచ్ఛగా తిరగాలనే  కారంణానే ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని మంత్రి గొట్టిపాటి అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..