Botsa Satyanarayana: “జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదు.. ఈ ప్రాంతానికి టీడీపీ అవసరమా”.. మంత్రి బొత్స ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ ఇష్యూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. మూడు రాజధానులతోనే వికేంద్రీకరణ సాధ్యమని ప్రభుత్వం చెబుతుండగా.. అమరావతినే ఏకైక రాజధానిగా...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ ఇష్యూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. మూడు రాజధానులతోనే వికేంద్రీకరణ సాధ్యమని ప్రభుత్వం చెబుతుండగా.. అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ మంత్రులు, వైసీపీ నేతలు విశాఖ గర్జన కార్యక్రమం చేపట్టారు. తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనకు ప్రతిరూపంగా విశాఖ గర్జన నిలిచిందని చెప్పారు. జోరున వర్షం కురుస్తోన్నా ప్రజలు పాల్గొన్నారన్నారు. విశాఖకు రాజధాని వద్దని గొంతులెత్తుతున్న వారికి ఇది ఒక కనువిప్పు కలిగించే సంఘటనగా మారింది తెలిపారు. విశాఖకు రాజధాని వద్దనే వాళ్లు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాలని చెప్పారు. విశాఖ మీద.. ఉత్తరాంధ్ర మీద ఎందుకంత ద్వేషమని స్పందించారు. ప్రతిపక్ష పార్టీల ఆకాంక్షలు నెరవేరవన్న మంత్రి బొత్స.. విశాఖకు రాజధాని వచ్చి తీరడం ఖాయమని స్పష్టం చేశారు. విశాఖలో ఇంటింటికెళ్లి బ్యాలెట్ పెడితే ప్రతిపక్షాలకు విశాఖ ప్రజల అభిప్రాయం తెలుస్తుందని వివరించారు.
విశాఖ గర్జన జరుగుతోంటే.. రాజధాని వద్దని టీడీపీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఈ ప్రాంతానికి టీడీపీ అవసరమా..? ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో టీడీపీ నేతలను ప్రజలు అడగాలి. జనసేనకు ఓ విధానం ఉందా..?. జనసేన అసలు రాజకీయ పార్టీనేనా..?. జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదు. విశాఖకు రాజధాని వద్దని పవన్ ఎందుకొద్దంటున్నారు..?. గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పలేదా..?. ఎయిర్ పోర్టులో సంఘటనను చంద్రబాబు తప్పు పట్టడం పోయి పోలీసులను తప్పు పడతారా..?. ఏ చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు కదా..? మంత్రులపై దాడిని ఎందుకు తప్పు పట్టరు..?. జనసేన ఓ సెలబ్రిటీకి చెందిన పార్టీ. ఎయిర్ పోర్టు ఘటనలో పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం కూడా ఉంది. విశాఖకు రాజధాని కావాలని అంతా కోరుకుంటుంటే ఏ ముఖం పెట్టుకుని అమరావతే రాజధాని అంటున్నారు. రాజధాని అంటే ఎయిర్ కనెక్టివిటీ.. సీ కనెక్టివిటీ ఉండాలి.. రైల్ కనెక్టివిటీ ఉండాలి. అమరావతికి ఏ కనెక్టివిటీ ఉంది. విశాఖకు కొద్దిపాటి ఖర్చు పెడితే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది.
– బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మంత్రి
మరోవైపు.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర – 2 పై మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్ చేశారుర. అమరావతి కోసం పాదయాత్ర చేస్తోంది రైతులు కాదని చెప్పారు. రాజధాని రైతులు ఏదో త్యాగం చేశారని చెబుతున్నారన్న మంత్రి.. వాళ్ల సంపదను పెంచుకోవడానికి చేసిన పనులను త్యాగం అని ఎలా అంటారని ప్రశ్నించారు. రాజధాని రైతులకే రాజ్యాంగం ఉందా..? ఉత్తరాంధ్ర ప్రజలు థర్డ్ క్లాస్ సిటిజన్సుగానే ఉండాలా..? అని మండిపడ్డారు. మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతం వాళ్లనే తిడితే మేం చూస్తూ ఊరుకోవాలా..? అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వీలైనంత త్వరగా సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేయాలని కోరుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..