AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru Corporation Results: చంద్రబాబు పేపర్ టైగర్ మాత్రమే.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి అవంతి..

Eluru Corporation Results: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Eluru Corporation Results: చంద్రబాబు పేపర్ టైగర్ మాత్రమే.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి అవంతి..
Minister Avanthi Srinivas
Shiva Prajapati
|

Updated on: Jul 26, 2021 | 3:50 PM

Share

Eluru Corporation Results: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలపై వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పందించారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్‌లతో సహా వైసీపీకి 61 మంది కార్పొరేటర్లు ఉన్నారని, వైసీపీ తరఫున ఈ రోజు సాయంత్రం విప్ జారీ చేస్తున్నామని అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడులో ఇంకా మార్పు రాకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలను చంద్రబాబు తారుమారు చేయలేరని, కోర్టు ఫలితాలను మార్చలేరని అన్నారు. చంద్రబాబు పేపర్ టైగర్‌గా మారిపోయారని దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీలు రాజీనామా చేయాలంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారంటూ.. ఆచరణలో మాత్రం చూపించడం లేదని అన్నారు.

కార్పొరేషన్ ఎలక్షన్స్‌లో పది మంది స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు గెలుపు ఖాయం అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. క్రాస్ ఓటింగ్‌ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను పోటీలో దింపారని ఆరోపించారు. బలం లేకపోయినా పోటీకి దిగడం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనం అని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత అనే వ్యక్తి ప్రభుత్వానికి సహకరించాలి.. కానీ, చంద్రబాబు మాత్రం అడుగడుగునా అడ్డుపడుతున్నారు అని విమర్శలు గుప్పించారు. టీడీపీ అభ్యర్థుల ప్రపోజల్స్‌ని విత్ డ్రా చేసుకుంటే చంద్రబాబుకి గౌరవం పెరుగుతుందన్నారు. బలం లేకపోయినా పోటీలో ఉండటం మంచి సాంప్రదాయం కాదన్నారు. తాము ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదన్న ఉమ్మారెడ్డి.. చంద్రబాబు తన ఆలోచనా విధానాలను మార్చుకోవాలని హితవు చెప్పారు.

Also read:

Mutual Funds: నిర్ధిష్ట లక్ష్యం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్ బెటర్.. వీటి గురించి తెలుసుకోండి..

Healthy Breakfast: ఉదయాన్నే పెరుగు, అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలు.. బరువు తగ్గించే సూపర్ ఫుడ్..

Tokyo Olympics 2020 Live: మీరాబాయి చానుని ప్రశంసించిన రాజ్యసభ సభ్యులు.. స్వదేశం చేరుకున్న రజత పతక విజేత