Dharmana Prasada Rao: మగవారికి పెద్దగా బాధ్యతలు పట్టవు.. మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..
అమ్మ ఒడికి కాకుండా నాన్న జేబులో ప్రభుత్వం డబ్బులు వేస్తే అవి కుటుంబ అవసరాలకు కాకుండా వేరే దుకాణంకి వెళ్లిపోతాయని ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తాజాగా మరో అడుగు ముందుకు వేశారు.
అమ్మ ఒడికి కాకుండా నాన్న జేబులో ప్రభుత్వం డబ్బులు వేస్తే అవి కుటుంబ అవసరాలకు కాకుండా వేరే దుకాణంకి వెళ్లిపోతాయని ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తాజాగా మరో అడుగు ముందుకు వేశారు. మగవారికి పెద్దగా బాధ్యతలు పట్టవు.. పోరంబోకుల్లా తినేసి ఊరుమీదకి వెళ్లిపోతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదనే ఇంటి ఇల్లాలకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందన్నారు ధర్మాన. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను మళ్లీ సీఎం చేయకపోతే ఇప్పుడు ఇచ్చిన మూడు వేల రూపాయలు మహిళలకు అందవన్నారు. ఆడోళ్లకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని విమర్శిస్తున్నారు.. మీ ఇంటిలో ఉన్న మగాళ్లు అసలు విలన్లు అని మంత్రి వ్యాఖ్యానించారు.
సినిమాల కోసం, కళ్లు, మద్యం కోసం మహిళలను డబ్బులు అడగాల్సి వస్తుందని మగాళ్లు బాధపడుతున్నారంటూ మంత్రి ధర్మాన పేన్నారు. అధికారం అనే కీ జగన్ వద్ద ఉంది. అందుకే సంపదను మహిళల చేతుల్లో పెట్టారు. అధికారం లేకపోతే సీఎం జగన్ పథకాలు అమలు చేయలేరంటూ ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కిల్లిపాలెంలో జరిగిన ఆసరా పంపిణీ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. ధర్మాన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..