5

Chittoor: కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతున్న చిన్నారిని కాపాడి.. తాను మృత్యు ఒడిలోకి

ఓ చిన్న పిల్ల కరెంట్ షాక్ కొట్టి విలవిల్లాడుతుంది. ఆ పాపను కాపాడేందుకు సాహసించింది ఓ మహిళ. ఆ పని చేయగలిగింది. కానీ తన ప్రాణం పోగొట్టుకుంది. కన్నీరు పెట్టించే ఈ కథనం పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Chittoor: కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతున్న చిన్నారిని కాపాడి.. తాను మృత్యు ఒడిలోకి
Gautami
Follow us

|

Updated on: May 28, 2023 | 12:55 PM

విధి మనుషులు జీవితాలతో ఎప్పుడు ఎలా అడుకుంటుందో అస్సలు ఊహించలేం. ఈ ఘటన గురించి చదివితే మీకు కన్నీళ్లు రాక మానవు. తిరుపతిలో  పవన్ – గౌతమి దంపతులు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి ఒక ఆరేళ్ల బాబు ఉన్నాడు.  మధ్య తరగతి కుటుంబం…మధ్య తరగతి జీవితం… నెట్టుకొస్తున్నారు.  కానీ ఉన్నట్టుండి ఒక గ్రహణం.. ఒక తీరని విషాదం. గౌతమి ఇప్పుడు లేదు…అవును… తనకి అనారోగ్యం లేదు.. పరిపూర్ణ భక్తి ఉంది… బిడ్డకి ఫ్రెండ్ లాంటి అమ్మ.  కానీ మరణం ఎప్పుడు ఎలా దరిచేరుతుందో చెప్పలేం. చిత్తూరు జిల్లా అరకొండ దగ్గర్లో గొల్లపల్లి…. గౌతమి వాళ్ల బంధువులు అక్కడ 35 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం గొల్లపల్లిలో ప్రతిష్టించారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ ఏడు వైభవంగా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగా… భారీ ఏర్పాట్లు చేశారు.. ఇనుప పైపులతో మండపాలు ఏర్పాటు చేసి… వాటి పైగా భారీ లైటింగ్ డెకరేషన్ చేశారు.

గౌతమి సాయంత్రం 5 గ 50 నిమిషాలకి తన భర్తతో ఫోన్‌లో మాట్లాడింది.  భర్త పవన్ గొల్లపల్లికే వెళ్తున్నాడు.. దారిలో ఉన్నాడు. వచ్చాక కలిసి దర్శనం చేసుకుందాం అని అనుకున్నారు. కానీ విధి మరోలా తలిచింది.  అక్కడున్న బంధువులు దర్శనానికి వెళ్దాం.. ప్రదీక్షణ చేద్దాం అని బలవంతం చేయటంతో….. ప్రదీక్షణలు చేసింది. మాంగళ్యానికి కుంకుమ బొట్టు పెట్టుకుంది.అది జరిగే సమయంలో అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. గౌతమి ప్రదీక్షణలు తర్వాత బయటకి వచ్చింది… ఒక పాప ఆడుతూ ఆడుతూ ఇనుప పైప్‌ని పట్టుకుంది… కరెంటు లీక్ అయ్యి పాపకి షాక్ కొడుతోంది…. ఇబ్బంది పడుతున్న పాపని చూసి గౌతమి అటు వెళ్ళి… పాపని కుడి చేత్తో లాగి… పొరపాటున సపోర్ట్ కోసం ఏడం చేత్తో ఆ ఇనుప పోల్‌ని పట్టుకుంది.. పాపని వదిలేసింది… పాప సేఫ్… కానీ క్షణాల్లో గౌతమి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.  కార్డియాక్ అరెస్ట్‌తో తను అక్కడికక్కడే శాశ్వత నిద్రలోకి జారుకుంది.

అపోలో హాస్పిటల్ వారు డెత్త్ సర్టిఫికెట్ ఇవ్వటం మినహా ఏమి చేయలేకపోయారు. గౌతమి గారి మనసు ఎంతో గొప్పది.. ఆమె త్యాగం వెలకట్టలేనిది. అమ్మా గౌతమి మీకు సద్గతి కలగాలని కోరకోవడం.. ఓ నాలుగు కన్నీటి బొట్లు రాల్చడం తప్ప ఏమీ చేయలేని సాధారణ మానవులం మేము.

(ఈ వార్తా సమాచారం ప్రముఖ దర్శకుడు, రచయిత రాజసింహ తడినాడ నుంచి సేకరించబడింది)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన!
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన!
చీపురు చేతపట్టి బీచ్ లో ఉడుస్తోన్నా అక్షయ్ కుమార్..
చీపురు చేతపట్టి బీచ్ లో ఉడుస్తోన్నా అక్షయ్ కుమార్..
హిట్‌మ్యాన్ లిస్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యశస్వీ జైస్వాల్..
హిట్‌మ్యాన్ లిస్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యశస్వీ జైస్వాల్..
వార్ సీక్వెల్ కంటే ముందే ఆ బాలీవుడ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
వార్ సీక్వెల్ కంటే ముందే ఆ బాలీవుడ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
భారత వాయుసేన హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.
భారత వాయుసేన హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.
ఇంటి వెనుక ట్రంక్‌పెట్టెలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు..
ఇంటి వెనుక ట్రంక్‌పెట్టెలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు..
ది వ్యాక్సిన్ వార్ మూవీపై స్పందించకుండా.. వార్తల్లో నిలిచిన అదా
ది వ్యాక్సిన్ వార్ మూవీపై స్పందించకుండా.. వార్తల్లో నిలిచిన అదా
: సిద్ధిపేట ప్రజల ఆశయం.. నెరవేరనున్న దశబ్దాల కల..
: సిద్ధిపేట ప్రజల ఆశయం.. నెరవేరనున్న దశబ్దాల కల..
బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. బట్టలు ఊడదీస్తారు
బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. బట్టలు ఊడదీస్తారు
తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి.. జోరు పెంచిన కేటీఆర్, హరీష్ రావు..
తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి.. జోరు పెంచిన కేటీఆర్, హరీష్ రావు..