SAAP Recruitment: విజయవాడ శాప్‌లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ.

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాధికార సంస్థ పలు పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పలు క్రీడాంశాల్లో కోచ్‌/మెంటార్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (ఆదివారం) గడువు ముగియనున్న నేపథ్యంలో...

SAAP Recruitment: విజయవాడ శాప్‌లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ.
Saap Jobs
Follow us

|

Updated on: May 28, 2023 | 1:28 PM

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధప్రదేశ్ లో పలు పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పలు క్రీడాంశాల్లో కోచ్‌/మెంటార్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (ఆదివారం) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. వవ

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 కోచ్‌/మెంటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, రైఫిల్ షూటింగ్, స్విమ్మింగ్, హాకీ, జూడో, ఫెన్సింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నంద్యాల, గుంటూరు, శ్రీ సత్య సాయి, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సుతో పాటు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను విద్యార్హత, సంబంధిత విభాగంలో పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 జీతంగా అందిస్తారు.

* దరఖాస్తులను kisce.ap@gmail.com మెయిల్‌ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (28-05-2023) ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..