
భర్త నుంచి దూరంగా ఉంటుందని.. ఓ దుర్మార్గుడు ఆమెపై కన్నేశాడు.. ఆ తర్వాత అదును చూసి.. స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడు.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కామపిశాచిని అరెస్టు చేశారు. కానీ.. మళ్లీ బయటకు వస్తే చంపుతాడన్న భయంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో చోటుచేసుకుంది. అత్యాచార బాధితురాలు కొద్దిరోజులుగా భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని రిమాండ్‌కు పంపించారు. అయితే నిందితుడు జైలు నుంచి బయటకువస్తే ఇబ్బంది పెడతాడన్న భయంతో అత్యాచర బాధితురాలు సూసైడ్ చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రేమ, పెళ్లి పేరుతో అంతకుముందు అత్యాచార బాధితురాలి వెంటపడ్డాడు శ్రీనివాసరావు. ఆమెకు మరొకరితో పెళ్లి కావడంతో జీర్ణించుకోలేకపోయాడు. వేధింపులకి గురిచేశాడు. ఈ క్రమంలోనే భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. నెల రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి స్నేహితులతో కలిసి శ్రీనివాసరావు ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని రిమాండ్‌కి తరలించారు.
శ్రీనివాసరావు జైలు నుంచి బయటకు వస్తే మళ్లీ తనకు ఇబ్బందులు తప్పవని భయపడిన బాధితురాలు ఇంట్లో ఎవరూలేని సమయంలో సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలను సూసైడ్‌నోట్‌లో వివరించింది. మరోవైపు శ్రీనివాసరావుతో పాటు అతని స్నేహితుల్ని అరెస్ట్ చేయాలంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..