AP SEC Orders : మార్చి10ని సెలవు దినంగా ప్రకటించాలి..! కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ఎస్‌ఈసీ

AP SEC Orders : రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా మార్చి 10ని సెలవుదినంగా ప్రకటించాలని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు.

AP SEC Orders : మార్చి10ని సెలవు దినంగా ప్రకటించాలి..! కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ఎస్‌ఈసీ

Updated on: Feb 23, 2021 | 12:07 AM

AP SEC Orders : రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా మార్చి 10ని సెలవుదినంగా ప్రకటించాలని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికలు జరుగనున్న 12 నగర పాలికలు, 75 పురపాలికల్లో సెలవు ప్రకటించాలని సూచించారు. సోమవారం ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌, కౌంటింగ్‌ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎన్నికల రోజు (మార్చి 10), కౌంటింగ్‌ దినం (మార్చి 14) న ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, సమస్మాత్మక పోలింగ్‌ కేంద్రాలపై పోలీస్‌శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో మైనర్ బాలికల కిడ్నాప్.. టాబ్లెట్‌ మింగించి అఘాయిత్యానికి ప్రయత్నం..