Andhra: అర్థరాత్రి ఉలిక్కిపడిన మంగళగిరి.. ఈ రాళ్ల కోసం పెద్ద కథే నడిచింది..

మంగళగిరి సమీపంలోని యర్రపాలెం ఇండ్రస్ట్రీయల్ ఏరియాలో జరిగిన చోరి కలకలం రేపుతోంది. బంగారు ఆభరణాల్లో వినియోగించే పది లక్షల రూపాయల విలువైన రంగు రాళ్లను పదిహేను మంది సభ్యుల ముఠా వచ్చి తీసుకెళ్లింది. ఈ చోరిపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra: అర్థరాత్రి ఉలిక్కిపడిన మంగళగిరి.. ఈ రాళ్ల కోసం పెద్ద కథే నడిచింది..
Gemstone Factory Robbery

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 14, 2025 | 1:10 PM

మంగళగిరికి చెందిన నాగరాజు యర్రపాలెం ఇండ్రస్ట్రీయల్ ఏరియాలో రంగు రాళ్లను సాన బెట్టే పరిశ్రమను నిర్వహిస్తున్నారు. విలువైన ముడి రంగురాళ్లను తీసుకొచ్చి వాటికి పాలిష్ పడతారు. అనంతరం వాటిని బంగారు షాపులకు విక్రయిస్తుంటారు. ముడి రాళ్లను పాలిష్ చేసే ఫ్యాక్టరీలోకి రాత్రి పదిహేను మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మూడు కార్లలో వచ్చిన వ్యక్తులు ఫ్యాక్టరీలోకి చొరబడ్డారు. ఫ్యాక్టరీ వాచ్ మెన్ ను అతని భార్యను కత్తులతో బెదిరించారు. వారి వద్ద కాపాలాగా ఐదుగురు వ్యక్తులు ఉండగా మరొకి ఐదుగురు ఫ్యాక్టరీ షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. పాలిష్ చేసిన ఏ గ్రేడ్ రాళ్లను మూడు సంచుల్లో సర్దుకున్నారు. మరొక ఐదుగురు కాపాలా ఉండగా మూడు సంచులను కార్ లో పెట్టుకొని అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత మిగిలిన పది మంది కూడా అక్కడ నుండి ఉడాయించారు. వాచ్ మెన్ కొడుకుపై కూడా దాడి చేశారు. ఈ చోరి స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి పన్నెండు గంటల సయమంలో ఫ్యాక్టరీలోకి వచ్చిన దొంగలు దాదాపు మూడు గంటల పాటు ప్యాక్టరీలోనే ఉన్నారు.

ఫ్యాక్టరీ యజమాని నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరా విజువల్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్యాక్టరీలోకి ప్రవేశించినట్లు రికార్డు అయ్యాయి. అయితే తెలిసిన వ్యక్తులే చోరికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే రాజధాని పక్కనే ఉన్న ఫ్యాక్టరీలోకి అర్ధరాత్రి పదిహేను మంది ప్రవేశించి చోరికి పాల్పడటం కలకలం రేపుతోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..