AP Crime News: కూర్చున్నట్టే కూర్చొని కత్తితో దాడి చేశాడు.. సీసీ టీవీలో రికార్డయిన షాకింగ్ దృశ్యాలు..

East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. పట్టపగలే దారుణంగా కత్తితో పొడిచి చంపుతున్న వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

AP Crime News: కూర్చున్నట్టే కూర్చొని కత్తితో దాడి చేశాడు.. సీసీ టీవీలో రికార్డయిన షాకింగ్ దృశ్యాలు..
Murder

Updated on: Mar 13, 2022 | 2:54 PM

East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. పట్టపగలే దారుణంగా కత్తితో పొడిచి చంపుతున్న వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య బతిమిలాడుతున్నా వినకుండా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపడం సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. నిన్న యానాంలో కత్తిపోట్లకు గురైన వెంకేటేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టపగలే దారుణంగా ఇంటి యజమానికి కత్తితో పొడిచి చంపడం స్థానికంగా (Yanam) కలకలం రేపింది. హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాళ్లరేవు మండలంలో పైనాన్స్ వ్యాపారం చేస్తున్న నారాయణ స్వామి వద్ద గతంలో 6 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు వెంకటేశ్వరరావు. తిరిగి చెల్లించక పోవడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. నిన్న మధ్యాహ్నం వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చిన నిందితుడు నారాయణ స్వామి బాకీ, వడ్డీ విషయంపై వెంకటేశ్వరరావును నిలదీశాడు. వెంకటేశ్వరరావు ఫోన్ మాట్లాడుతుండగా అతనిపై ఒక్కసారిగా కత్తితో విరుచుకుపడ్డాడు నారాయణస్వామి. 12 చోట్ల మార్చి మార్చి..పొడవడంతో వెంకేటేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ హత్యకేసులో ఆర్థికలావాదేవీలేనా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

Also Read:

Crime News: చిరుత మాంసంతో కమ్మటి విందు.. ఆపై మరో ప్లాన్.. కట్ చేస్తే..

Viral: కుక్కల దాణా అనుకున్నారు.. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగగానే మైండ్ బ్లాంక్