Andhra Pradesh: విశాఖ ఏజెన్సీలో దారుణం.. చేతబడి చేశాడనే నెపంతో ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా..

Andhra Pradesh: విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి నెపంతో రెండు కుటుంబాలు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Andhra Pradesh: విశాఖ ఏజెన్సీలో దారుణం.. చేతబడి చేశాడనే నెపంతో ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా..
Black Magic

Updated on: Dec 02, 2021 | 5:44 AM

Andhra Pradesh: విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి నెపంతో రెండు కుటుంబాలు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. అనంతగిరి మండలం టోకూరు పంచాయితీ బక్మర్ వలస గ్రామంలో ఘటన జరిగింది. వివరాల్లోకెళితే.. గ్రామంలో కిల్లో కోమటి అనే గిరిజనుడుని హత్య చేశారు ప్రత్యార్థి సుబ్బారావు కుటుంబం. కత్తితో పొడిచి చంపేసారు. దింతో ఆగ్రహంతో ఉగిపోయిన బాదిత కుటుంబం.. సుబ్బారావు కుటుంబంపై తిరుగుబాటు చేసింది. ఆయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు.

ఈ ఘటనల్లో ప్రత్యార్థి సుబ్బారావు కు తీవ్రగాయాలాయ్యాయి. ఆసుపత్రికి తరలించగా సుబ్బారావు మృతి చెందాడు. ఇక తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కోమటి కొడుకులు భగవాన్, బలరాం. అయితే.. దాడికి పాల్పడిన సుబ్బారావు కొడుకు డొంబు పారిపోవడంతో అతని ఇంటిని ధ్వంసం చేశారు స్థానికులు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన పలువురుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also read:

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..