Shocking: అరెరే ఎంత ఘోరం జరిగిపాయే.. కోళ్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం.. ఇంతలోనే ఊహించని షాక్..
Shocking: డబ్బులు, నగలు, ఇళ్లలో వస్తువులు ఎత్తుకెళ్లే దొంగలతో పాటు.. కోళ్లను ఎత్తుకెళ్లే దొంగలు కూడా ఉంటారు. కొందరు సరదా కోసం, జల్సాల..
Shocking: డబ్బులు, నగలు, ఇళ్లలో వస్తువులు ఎత్తుకెళ్లే దొంగలతో పాటు.. కోళ్లను ఎత్తుకెళ్లే దొంగలు కూడా ఉంటారు. కొందరు సరదా కోసం, జల్సాల కోసం కోళ్లను దొంగిలిస్తే.. మరికొందరు సీరియస్‌గానే దోపిడీలకు పాల్పడుతుంటారు. తాజాగా కొందరు దొంగులు కోళ్లను ఎత్తుకెళ్లేందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యారు. వీరిలో ముగ్గురు తప్పించుకోగా.. ఒకరు మాత్రం ప్రజల చేతికి చిక్కిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఏలూరు జిల్లా నూజివీడులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నూజివీడు ఎంఆర్ అప్పారావు కాలనీలో నలుగురు అగంతకులు కోళ్ల దొంగతనానికి వచ్చారు. అయితే, కోళ్ల శబ్ధానికి స్థానికులు అలర్ట్ అయ్యారు. దొంగలను గమనించిన స్థానికులు.. వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు పారిపోగా.. లాకే అవినాష్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఆగ్రహతో ఊగిపోయిన ప్రజలు.. దొంగను చావబాదారు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన అవినాష్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు అవినాష్. కాగా, అవినాష్‌పై దాడికి పాల్పడిన స్థానికులు సయ్యద్ గయుద్దీన్, కొంపాటి అలెగ్జాండర్‌లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..