చేతబడి అనుమానంతో సజీవదహనం.. ఏపీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన

అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్న.. చంద్రయాన్ కాలంలో కూడా అనారిక చర్యలకు అంతూపోంతూ లేకుండా పోతోంది. చేతబడి, చిల్లంగి, బాణమతి పేరుతో సాటి మనుషుల్ని దారుణంగా చంపుతున్న సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సభ్యసమాజం సిగ్గుపడే ఇటువంటి దారుణ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు. వివరాల్లోకి వెళితే డుంబ్రిగూడ మండలం పుట్టంబందకు చెందిన జయరాం అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని గ్రామంలో కొంత కాలం నుంచి ప్రచారం […]

  • Updated On - 10:21 am, Thu, 26 September 19 Edited By:
చేతబడి అనుమానంతో సజీవదహనం..  ఏపీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన

అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్న.. చంద్రయాన్ కాలంలో కూడా అనారిక చర్యలకు అంతూపోంతూ లేకుండా పోతోంది. చేతబడి, చిల్లంగి, బాణమతి పేరుతో సాటి మనుషుల్ని దారుణంగా చంపుతున్న సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సభ్యసమాజం సిగ్గుపడే ఇటువంటి దారుణ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు. వివరాల్లోకి వెళితే డుంబ్రిగూడ మండలం పుట్టంబందకు చెందిన జయరాం అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని గ్రామంలో కొంత కాలం నుంచి ప్రచారం సాగుతోంది. ఈ అనుమానంతో జయరాంపై గ్రామస్తులు నిఘాపెట్టారు. అయితే ఇటీవల గ్రామంలో కొన్ని మరణాలు సంభవించడం, కొంతమంది అనారోగ్యం పాలు కావడంతో గ్రామంలో జయరాంపై ఆగ్రహం పెంచుకున్నారు. వీటన్నిటీకీ కారణం ఇతడే అని, చేతబడి చేయడంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు అనుమానించారు. ఈ నేపథ్యంలో బుధవారం జయరాంను పట్టుకుని కర్రలతో విచక్షణారహితంగా చావబాదారు. కొనఊపిరితో ఉన్న జయరాం ఎక్కడ బతికి మళ్లీ తమపై కక్ష పెంచుకుని చేతబడి చేస్తాడో అని భయపడి మూకుమ్మడిగా పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో ఈ సజీవ దహనానికి కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.