ప్రముఖ సాహితీవేత్త మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి ఇక లేరు

ప్రముఖ సాహితీవేత్త, వైఎస్ఆర్ జిల్లాలో మంచి పేరుపొందిన వైద్యుడు మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి(88) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. దీంతో సాహిత్య రంగంలో విషాదం నెలకొంది.

ప్రముఖ సాహితీవేత్త మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి ఇక లేరు
Mallemala Venu Gopal Reddy

Updated on: Jul 04, 2023 | 12:12 PM

ప్రముఖ సాహితీవేత్త, వైఎస్ఆర్ జిల్లాలో మంచి పేరుపొందిన వైద్యుడు మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి(88) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. దీంతో సాహిత్య రంగంలో విషాదం నెలకొంది. వేణుగోపాల్ రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా. కానీ ఆయన కడపకు చెందిన వరలక్ష్మీని వివాహం చేసుకొని అక్కడే సర్జన్‌గా స్థిరపడిపోయారు. తక్కువ ఫీజుతోనే వైద్యం చేస్తారని ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత సుందరరామిరెడ్డి ఆయనకు సొంత సొదరుడు. గత నాలుగేళ్లలో వేణుగోపాల్ రెడ్డికి 2 సార్లు జారిపడడంతో అతనికి శస్త్ర చికిత్సలు కూడా జరిగాయి. అయితే ఆయన మరణ వార్త తెలియగానే వైసీపీ ఎంపీ విజయసాయ్ రెడ్డి విచారం వ్యక్తం చేస్తారు. ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త, గొప్ప వైద్యుడైన మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి కన్నుమూయడం బాధాకరమని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

 

మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి 1960లోనే తన కుమార్తె శిరీష పేరుతే కథలు రాయడం ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా దాదాపు 100 కథలు రాశారు. ఆవలి గట్టు అనే నవలాను కూడా రాశారు. ఆయన జిల్లా రచయితల సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు శ్రీశ్రీ, కొడవటిగంటి లాంటి సాహితీవేత్తలను కూడా కడపకు రప్పించి సాహిత్య సభలు నిర్వహించారు. మల్లెమాల సాహిత్యం పురస్కారం ఏర్పాటు చేసి 2009 నంచి సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేస్తున్నారు. ఇటీవల కరోనా కారణంగా రెండేళ్లపాటు పురస్కారాలు ప్రకటించలేకపోయారు. తర్వాత మళ్లీ ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఆరోగ్యం సహరించకపోవడంతో ఇవ్వలేకపోయారు.