Andhra Pradesh: పైకి చూస్తే పత్తి చేను.. కానీ అధికారులు లోపలికి వెళ్లి చూడగా అంతకుమించి..

మాంచి స్కెచ్ వేశాడు.. పత్తి చేనులో సెటప్ పెట్టాడు. ఎవరికీ కూడా దొరకనని అనుకున్నాడు..

Andhra Pradesh: పైకి చూస్తే పత్తి చేను.. కానీ అధికారులు లోపలికి వెళ్లి చూడగా అంతకుమించి..
Cotton Crop
Follow us

|

Updated on: Dec 21, 2022 | 9:30 AM

కేటుగాళ్ల క్రియేటివిటీ పెరిగిపోతోంది. తప్పుడు పనులు చేసేందుకు ప్రతీసారి సరికొత్త స్కెచ్ వేస్తూ.. అధికారుల నుంచి తప్పించుకుంటున్నారు. ఈ రైతు కూడా అంతే! మాంచి స్కెచ్ వేశాడు.. పత్తి చేనులో సెటప్ పెట్టాడు. ఎవరికీ కూడా దొరకనని అనుకున్నాడు. అయితేనేం చివరికి అడ్డంగా బుక్కయ్యాడు. తులసివనంలో గంజాయి మొక్క అనేది నానుడి. కానీ ఈ రైతు కొంచెం కొత్తగా అలోచించి పత్తి చేనులో సెటప్ పెట్టాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో రైతు అంతర్ పంటగా పండిస్తున్న గంజాయిని సెబ్ అధికారులు ద్వంసం చేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గంజాయి వాసన గప్పుమనింది. అత్యాశకుపోయి అడ్డంగా బుక్ అయ్యాడో రైతు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గంజాయి సాగు చేస్తున్న రైతు నిర్వాహకాన్ని సెబ్ అధికారులు వెలుగులోకి తెచ్చారు. పత్తిపంటలో అంతర్ పంటగా గంజాయిని పండిస్తున్నట్లు గుర్తించారు. పొలాన్ని మొత్తం తనిఖీ చేసి గంజాయి మొక్కలను సెబ్ అధికారులు ధ్వంసం చేశారు. అనంతరం గంజాయి సాగు చేస్తున్న రైతును అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. గంజాయి కోసమే పంటను వేస్తున్నాడా?.. లేక తెలియక అంతర్ పంటగానే వేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అలాగే అధిక సంపాదన అత్యాశతో గంజాయి సాగు చేశాడా? లేక ఎవరైన ఆశచూపితే గంజాయిని పండిస్తున్నాడా అనే కోణంలో కూడా ఎంక్వైరీ మొదలెట్టారు అధికారులు. నార్కోటిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించిన 24 గంటల్లోనే సెబ్ అధికారులు విసృతస్థాయిలో చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే పల్నాడు జిల్లాలో గంజాయి సాగును అడ్డుకున్నారు.