ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్..? ఈవీఎం ధ్వంసం కేసులో ఈసీ సీరియస్..

|

May 22, 2024 | 5:45 PM

పోలింగ్‌ రోజు మాచర్లలో ఈవీఎంల ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే ఆయనను ఏ1గా ఎఫ్ఐఆర్‎లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ నిర్వహిచారు ఎన్నికల అధికారులు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈనేపథ్యంలోనే పల్నాడు నియోజకవర్గంలో పెట్రోలు బాంబులతో దాడులు చేసుకున్నారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్..? ఈవీఎం ధ్వంసం కేసులో ఈసీ సీరియస్..
Pinnelli Ramakrishna Reddy
Follow us on

పోలింగ్‌ రోజు మాచర్లలో ఈవీఎంల ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే ఆయనను ఏ1గా ఎఫ్ఐఆర్‎లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ నిర్వహిచారు ఎన్నికల అధికారులు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈనేపథ్యంలోనే పల్నాడు నియోజకవర్గంలో పెట్రోలు బాంబులతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఈవీఎంను ధ్వంసం చేశారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. ఈ దృశ్యాలు వెబ్ క్యామ్ లలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కమార్ మీనా సీరియస్ అయ్యారు. విదేశాలకు పారిపోకుండా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేసిన ఏపీ పోలీసులు.. పిన్నెల్లి డ్రైవర్‌, అనుచరుల అరెస్ట్‌ చేశారు.

దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాగైనా ఎమ్మెల్యేను పట్టుకోవడం కోసం అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో తలదాచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణపై ఐపీలోని143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..