AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇదేం ట్విస్ట్.. మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిపై అత్యాచారం కేసులో నిందితుడు వాడే..

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఉద్యోగినిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె కాళ్లు, చేతులు కట్టివేసి, వివస్త్రను చేసి, జననాంగంపై ఇనుప చువ్వతో దాడి చేశాడు. మహిళపై వికృతంగా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.

Andhra: ఇదేం ట్విస్ట్.. మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిపై అత్యాచారం కేసులో నిందితుడు వాడే..
Palnadu Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 08, 2026 | 10:04 AM

Share

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఉద్యోగినిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె కాళ్లు, చేతులు కట్టివేసి, వివస్త్రను చేసి, జననాంగంపై ఇనుప చువ్వతో దాడి చేశాడు. మహిళపై వికృతంగా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఆమె ప్రియుడే దాడికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈ నెల ఈస్టర్ పండుగ ముందు రోజు సత్తెనపల్లి వెళ్లేందుకు మహిళ సిద్దమైంది. అయితే, ఆమె ఒంటరిగా ఉన్నట్లు గమనించిన వ్యక్తి మంచినీళ్లు కావాలంటూ వచ్చి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెకు కొడుకు ఫోన్ చేయగా అటెండ్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కొడుకు స్నేహితులను తల్లి ఉంటున్న ఇంటి వద్దకు పంపించాడు. అయితే ఆమె కాళ్లు చేతులు కట్టేసి, వివస్త్ర గా పడిఉండటాన్ని గుర్తించిన స్నేహితులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు కూడా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అత్యాచారం చేశాడని చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు పలు అనుమానాలు వచ్చాయి. బాధితురాలి ఇంట్లో భోజనం పార్శిల్ ఉండటాన్ని గమనించారు. అదే విధంగా మద్యం బాటిల్స్ ఉన్నాయి. దీంతో ఆమెకు తెలిసిన వ్యక్తే వచ్చి ఉంటాడని పోలీసులు మొదట నుండి భావిస్తూ వచ్చారు. అయితే బాధితురాలు నోరు విప్పక పోవడంతో పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించడంపై దృష్టి పెట్టారు. మొదట సిసి కెమెరా విజువల్స్ జల్లెడ పట్టారు. అందులోనూ కీలకమైన అంశాలేమీ పోలీసులకు దొరకలేదు. ఆ తర్వాత మహిళా సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని వాట్సాప్ డేటా రిట్రీవ్ చేశారు. దీంతో ఆమె ప్రియుడే దాడి చేసినట్లు గుర్తించారు. వాట్పాస్ చాటింగ్ లో నిందితుడు రాజుపాలెం మండలానికి చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు.

అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మరొకవైపు బాధితురాలు కూడా కోలుకొని ఆసుపత్రి నుండి ఢిఛార్జ్ అయింది. దీంతో ఆమె వద్ద నుండి కీలక సమాచారం రాబట్టారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన అత్యాచారం కేసులో పోలీసులు ముందడుగు వేసి ఆమె ప్రియుడే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..