AP Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్.. 24 గంటల్లో అల్పపీడనం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 05, 2021 | 2:55 PM

Andhra Pradesh weather report: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాగా..  ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో

AP Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్.. 24 గంటల్లో అల్పపీడనం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..
Weather Report

Follow us on

Andhra Pradesh weather report: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాగా..  ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తరం బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం లలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఇది నైరుతి దిశకు కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో ఉత్తర, మధ్య బంగళాఖాతంలలో అల్ప పీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ అధికారులు ఆదివారం తెలిపారు.

దీని కారణంగా ఈరోజు, సోమవారం, మంగళవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ విభాగం తెలిపింది. కాగా.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు తీరం వెంబడి ఈదురుగాలులు 40-50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు, సోమవారం, మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: రాయలసీమలో ఈరోజు, సోమవారం, మంగళవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా.. అనంతపురం కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.

Also Read:

Crime News: తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడి హత్య.. చంపి పెన్నా నదిలో..

Bandla Ganesh: ప్రకాష్‌రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్‌.. ప్యానల్‌ నుంచి తప్పుకొని బరిలోకి..

Crime News: నమ్మకంతో నట్టేట ముంచిన మహిళ.. చిట్టీ పేరుతో రూ.5.6 కోట్ల మేర కుచ్చుటోపీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu