Andhra News: మల్లిక వశీకరణ విద్యకు లొంగలేదు.. అందుకే అంత పని చేశాడు..!!

గుంటూరులోని పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో నివాసం ఉండే మల్లిక పదేళ్ళ క్రితం అదే గ్రామానికే చెందిన అక్బర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం. ఆ తర్వాత గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్‌తో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తర్వాత అక్బర్‌తో మల్లిక విడాకులు తీసుకుంది.

Andhra News: మల్లిక వశీకరణ విద్యకు లొంగలేదు.. అందుకే అంత పని చేశాడు..!!
Lover Murdered Woman In Peddakakani Guntur District
Follow us
T Nagaraju

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 31, 2024 | 7:03 PM

ఆమె పేరు షేక్ మల్లిక… గుంటూరులో నివాసం ఉండే మల్లిక సొంతూరు పెదకాకాని మండలం నంబూరు.. పదేళ్ళ క్రితం అదే గ్రామానికే చెందిన అక్బర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం. ఆ తర్వాత గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్‌తో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అక్బర్‌కు తెలియడంతో అతనితో విడాకులు తీసుకొని పిల్లలను వదిలేసి ప్రేమ్ కుమార్‌తో గుంటూరు వచ్చేసింది. ప్రేమ్ కుమార్‌ను వివాహం చేసుకొని గుంటూరులో కాపురం పెట్టింది. కొద్దీ రోజుల తర్వాత బంగారు షాపు యజమాని రెహమాన్‌తో పరిచయం అయింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే రెహమాన్ మల్లికా కోరిక మేరకు ఐదు లక్షలు ఖర్చుపెట్టి ఒక పాపను దత్తత తీసుకొని ఆమెకు ఇచ్చాడు.

కొద్దీ కాలం తర్వాత మల్లిక, ప్రేమ్ కుమార్ గుంటూరు నుండి నంబూరూకు మకాం మార్చారు. అయితే అక్కడ మల్లిక మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకొని రెహమాన్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. మల్లికా దూరం పెట్టడాన్ని రెహమాన్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమెను వశం చేసుకునేందుకు వశీకరణ విద్య తెలిసిన వారికి కోసం రెహమాన్ గాలించాడు.

ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన జనాబ్ అహ్మద్‌కు వశీకరణ విద్యలో పట్టుందని రెహమాన్‌కు తెలిసింది. దీంతో అతనికి మూడు లక్షల రూపాయల డబ్బులిచ్చి గుంటూరు పిలిపించాడు. గత రెండు నెలల నుండి అహ్మద్ వశీకరణ పేరుతో క్షుద్ర పూజలు చేయడం మొదలు పెట్టాడు. మల్లికా జుట్టు, బట్టలు సేకరించి అహ్మద్‌కు ఇచ్చారు. రెండు మట్టి బొమ్మలు చేసిన అహ్మద్ వాటిపై మల్లిక జుట్టు, బట్టలుంచి తుమ్మ ముల్లు గుచ్చి ఏదేదో పూజలు చేశాడు. అయితే రెండు నెలలు గడిచినా మల్లిక ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. మల్లికా ఇంకా తనకు దక్కదని నిర్ణయించుకున్న రెహమాన్ ఆమెను చంపేయాలనుకున్నాడు. ఇందు కోసం తన స్నేహితులైన స్వప్న, రసూల్ సాయం తీసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం స్వప్న బైక్‌పై ముసుగులు ధరించిన రెహమాన్, రసూలు మల్లికా ఇంటికి వచ్చారు. మల్లికా ఇంటిలో ఒక్కతే ఉండటంతో ఆమె గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత వచ్చిన దారినే వెళ్ళిపోయారు. మల్లికా మృతిపై హత్య కేసు నమోదు చేసిన పెదకాకాని సీఐ నారాయణ స్వామి దర్యాప్తులో వెలుగు చూసిన ఆధారాలతో నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..