Andhra Pradesh: సచివాలయనికి దారి లేదంటున్న స్థానికులు.. ఎద్దుల బండ్లు పెట్టి వినూత్న నిరసన

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిందే సచివాలయ వ్యవస్థ. దేశంలోనే మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇప్పుడు అలాంటి సచివాలయానికే సమస్య వచ్చింది. సచివాలయానికి దారి ఇచ్చేది లేదంటూ స్థానికులు అడ్డం తిరగటం వివాదాస్పదంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా బెల్లకొండ మండలం నాగిరెడ్డి పాలెంలో సచివాలయాన్ని నిర్మించారు. అయితే ఆ సచివాలయానికి వెళ్లేందుకు రోడ్డు లేదు.

Andhra Pradesh: సచివాలయనికి దారి లేదంటున్న స్థానికులు.. ఎద్దుల బండ్లు పెట్టి వినూత్న నిరసన
Secretariat

Edited By: Aravind B

Updated on: Oct 07, 2023 | 6:02 PM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిందే సచివాలయ వ్యవస్థ. దేశంలోనే మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇప్పుడు అలాంటి సచివాలయానికే సమస్య వచ్చింది. సచివాలయానికి దారి ఇచ్చేది లేదంటూ స్థానికులు అడ్డం తిరగటం వివాదాస్పదంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా బెల్లకొండ మండలం నాగిరెడ్డి పాలెంలో సచివాలయాన్ని నిర్మించారు. అయితే ఆ సచివాలయానికి వెళ్లేందుకు రోడ్డు లేదు. ఏడాది క్రితం ప్రారంభమైన సచివాలయానికి టీడీపీకి చెందిన వెంకట రెడ్డి, శివారెడ్డి, వెంకట క్రిష్ణా రెడ్డి, చంద్రారెడ్డి అనే అన్నదమ్ములు తమ సొంత స్థలాన్ని సచివాలయానికి వెళ్లేందుకు దారికి ఇచ్చారు. అప్పటి నుండి సచివాలయంలో సమస్యల పరిష్కారం కోసం వచ్చే స్థానికులు ఆ రోడ్డు మార్గం నుండి వెళ్లేవారు. అయితే నెల క్రితం జరిగిన లోకేష్ యువగళం ఆ గ్రామంలో చిచ్చు పెట్టింది.

లోకేష్ పాదయాత్ర జరిగిన సమయంలో నాగిరెడ్డి పాలెంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఫ్లెక్సీలు రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీ లను తొలగించాలని పంచాయితీ అధికారులు డిమాండ్ చేశారు. ఇతర పార్టీల ప్లెక్స్‎లు ఉన్నప్పుడు యువగళం ప్లెక్స్ లు మాత్రమే తొలగించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తాము ఏర్పాటు చేసిన ప్లెక్స్ లు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోయిన రాజకీయ కారణాలతోనే అధికార పార్టీ నేతలు ఫ్లెక్సీలు తొలగించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తమ సొంత స్థలాన్ని సచివాలయానికి వెళ్లేందుకు దారికి ఇచ్చిన నలుగురు అన్నదమ్ములు అధికారులను కలిసి తమ స్వంత స్థలాన్ని దారికి ఇవ్వడం లేదని ఇక ముందు స్థానికుల రాకుండా చూడాలని విజ్నప్తి చేశారు. ప్రత్యామ్నాయ మార్గాన్నిచూసుకోవాలని కూడా సూచించారు. ఈ నలుగురు అన్నదమ్ములు టీడీపీ కార్యకర్తలు కావడంతో వివాదం మరింత ముదిరింది. అన్నదమ్ములు చెప్పిన మాటలను సచివాలయ అధికారులతో పాటు పంచాయితీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో నలుగురు సచివాలయానికి వెళ్లే మార్గాన్ని మూసేశారు.

ఇవి కూడా చదవండి

తమ ఇళ్ళ ముందు ఎద్దుల బండ్లు, నాగళ్లు, అడ్డుపెట్టి దారి మార్గంలో రాకపోకలను నిలువరించారు. ఇప్పటికే పంచాయితీ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గానికి ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. లేకపోతే దారి మొత్తాన్ని కందకం కొడతామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే వివాదానికి కారణం అవ్వటంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపకుంటే సచివాలయాన్ని మార్చండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..