AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే

మూడేళ్ల క్రితం ఏడు లక్షల అప్పు తీసుకున్నారు. క్రమ క్రమంగా వడ్డీ కూడా సకాలంలో చెల్లిస్తున్నారు. అయితే ఆ తర్వాత అప్పు తీసుకున్నవారికీ ఆరోగ్యం బాగోకపోవడం.. వడ్డీ కట్టడంలో ఇబ్బంది పడటంతో.. నెక్స్ట్ సీన్ ఏమైందంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Guntur: రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే
Representative Image
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 08, 2025 | 2:35 PM

Share

మూడేళ్ల క్రితం ఏడు లక్షల అప్పు తీసుకున్నారు. వందకు నాలుగు రూపాయల వడ్డీ చొప్పున చెల్లిస్తూ వచ్చారు. కొంతకాలం తర్వాత వడ్డీ కట్టలేకపోయారు. దీంతో వడ్డీ వ్యాపారి జులుం చూపించాడు. వడ్డీ కట్టకుంటే ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధించాడు. కొద్దీ రోజుల తర్వాత ఇంటికి తాళం వేశాడు. వ్యాపారి వేధింపులు తాళలేక బాధితులు గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు.

పాత గుంటూరుకు చెందిన అంకమ్మ అనే మహిళ తోపుడు బండిపై ఉల్లిపాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు గోపి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2022లో కుటుంబ అవసరాల నిమిత్తం గుంటూరు కార్పోరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేసే రాంబాబు వద్ద ఏడు లక్షల రూపాయలు డబ్బులు వడ్డీకి తీసుకున్నారు. వంద నాలుగు రూపాయల వడ్డీ చెల్లించే విధంగా మాట్లాడుకున్నారు. కొద్దికాలం పాటు వడ్డీ కూడా చెల్లించారు. అయితే అంకమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వడ్డీ సకాలంలో చెల్లించలేకపోయారు. అప్పటి నుంచి వడ్డీ వ్యాపారి రాంబాబు అంకమ్మ వద్దకు వెళ్లి వడ్డీ చెల్లించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. మే నెలలో వడ్డీ కట్టకపోతే ఇంటిలో ఉండటానికి వీల్లేదంటూ తాళం వేసి వెళ్లిపోయాడు.

అంకమ్మ పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ వెంటనే రాంబాబును పిలిపించి మందిలించి పంపిచడమే కాకుండా ఇంటి తాళం తీయించారు. అయితే కొద్దీ రోజుల తర్వాత రాంబాబు మరోసారి వచ్చి.. హెచ్చరించి వెళ్లాడు. మొత్తం డబ్బులు చెల్లిస్తామని వేడుకోవడంతో రాంబాబు వెళ్లిపోయాడు. అయితే పోలీసులు చెప్పిన వినకుండా మరోసారి ఇంటికి తాళం వేయడంతో తల్లి కొడుకులు రోడ్డున పడ్డారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు.

Follow Us
12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డ్ స్మాష్..
12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డ్ స్మాష్..
ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. వెంటనే మానేయండి
రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. వెంటనే మానేయండి
బద్దలైన సచిన్ స్పెషల్ హిస్టరీ.. కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డ్
బద్దలైన సచిన్ స్పెషల్ హిస్టరీ.. కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డ్
రూపాయి నష్టం లేకుండా.. డ్యామేజ్ నోట్లను ఇలా మార్చుకోండి!
రూపాయి నష్టం లేకుండా.. డ్యామేజ్ నోట్లను ఇలా మార్చుకోండి!
10 కేజీల సిలిండర్లపై కేంద్రం బిగ్ న్యూస్.. ఎప్పుడు వస్తాయంటే..?
10 కేజీల సిలిండర్లపై కేంద్రం బిగ్ న్యూస్.. ఎప్పుడు వస్తాయంటే..?
కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు
కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు
మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు
మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు
ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో 9 మంది.. ఆ జాబితాలో మనోడి పేరు మిస్
ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో 9 మంది.. ఆ జాబితాలో మనోడి పేరు మిస్
పాలకూర త్వరగా వాడిపోతుందా?.. ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా పాడవదు
పాలకూర త్వరగా వాడిపోతుందా?.. ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా పాడవదు