AP Rains: ఆహా.. చల్లటి వార్త.. ఏపీకి వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాలకు కుండపోత.!

నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు , కర్ణాటక లోని చాలా ప్రాంతాలకు , మహారాష్ట్ర, తెలంగాణ & కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు , పశ్చిమ మధ్య బంగాళాఖాతం లోని చాలా ప్రాంతాలకు, వాయువ్య బంగాళాఖాతంలోని.. ఆ వివరాలు ఇలా

AP Rains: ఆహా.. చల్లటి వార్త.. ఏపీకి వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాలకు కుండపోత.!
Rain Alert

Updated on: Jun 06, 2024 | 7:31 PM

నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు , కర్ణాటకలోని చాలా ప్రాంతాలకు , మహారాష్ట్ర, తెలంగాణ & కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు , పశ్చిమ మధ్య బంగాళాఖాతం లోని చాలా ప్రాంతాలకు, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్నిప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇపుడు 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, రత్నగిరి, షోలాపూర్, మెదక్, భద్రాచలం, విజయనగరం, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E గుండా కొనసాగుతున్నది.

నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియాలోని మరికొన్ని ప్రాంతాల్లోకి, కర్ణాటక & కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలకు, మహారాష్ట్ర (ముంబైతో సహా), తెలంగాణలోని మరి కొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్‌గఢ్ & దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు, వాయువ్య బంగాళాఖాతంలోని మరి కొన్ని ప్రాంతాలకు వచ్చే 3-4 రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాయలసీమ & పొరుగు ఉత్తర రాయలసీమ & పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3. 1 కిమీ ఎత్తులో ఉన్నది. సగటు సముద్ర మట్టానికి సగటున 4.5 కి.మీ & 5.8 కి.మీ మధ్య ఉన్న ద్రోణి / షియర్ జోన్ దాదాపు 16°N వెంబడి వ్యాపించి ఉన్నది.

—————————————-
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————

ఈరోజు :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

ఇవి కూడా చదవండి

రేపు:-

తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

ఎల్లుండి :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–

ఈరోజు:-

తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

రేపు:-

తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

ఇది చదవండి: చేపల వల బరువెక్కడంతో జాలర్లు సంబరపడ్డారు.. తీరా పైకి లాగి చూడగా.!

రాయలసీమ:-
—————-

ఈరోజు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

ఇది చదవండి: చల్ల.. చల్లగా.! ఏపీలో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..