Andhra Pradesh: అంతా పొలానికెళ్లారు.. ఆ ఇంట్లో నుంచి ఏదో శబ్ధం వస్తుందని చూడగా..

| Edited By: Jyothi Gadda

Jul 29, 2024 | 7:11 PM

ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తుండటంతో గ్రామంలో రైతులు ఇంటికి తాళం వేసి పంటసాగు చేయడానికి వెళ్తున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అంతా పొలానికి వెళ్లారు.. ఇదే అదునుగా భావించిన ఒక దొంగ ఆ ఇంటి తాళం పగలకొట్టే ప్రయత్నం చేసాడు. దీంతో ఇంటికి కొంత దూరంలో ఉన్న వారికీ ఆ శబ్ధాలు వినిపించటంతో అటుగా, వెళ్లి చూడగా, గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తాళం పగలగొడుతున్నాడని తెలిసింది. వెంటనే ఆ దొంగను పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేశారు.

Andhra Pradesh: అంతా పొలానికెళ్లారు.. ఆ ఇంట్లో నుంచి ఏదో శబ్ధం వస్తుందని చూడగా..
Thief
Follow us on

ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో గ్రామాల్లోని ప్రజలు పొలం బాటపట్టారు. ఊరంతా ఇళ్లకు తాళాలు వేసుకొని కుటుంబ సభ్యులంతా కలిసి వ్యవసాయ పొలాలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న దొంగలు పట్టపగలే ఊర్ల మీద పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా దొంగతనం కోసం వచ్చి గ్రామస్తుల కంటపడిన ఒక దొంగకు దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. దొంగను పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో ఓ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ.. గ్రామస్తుల కంట పడ్డాడు. దాంతో ఆ దొంగకు దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తుండటంతో గ్రామంలో రైతులు ఇంటికి తాళం వేసి పంటసాగు చేయడానికి వెళ్తున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అంతా పొలానికి వెళ్లారు.. ఇదే అదునుగా భావించిన ఒక దొంగ ఆ ఇంటి తాళం పగలకొట్టే ప్రయత్నం చేసాడు. దీంతో ఇంటికి కొంత దూరంలో ఉన్న వారికీ ఆ శబ్ధాలు వినిపించటంతో అటుగా, వెళ్లి చూడగా, గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తాళం పగలగొడుతున్నాడని తెలిసింది. వెంటనే ఆ దొంగను పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. గ్రామస్తులు అంత కలిసి అతని కుల్లపొడిచేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడు, గార్లదిన్నె గ్రామానికి చెందిన సామెల్ అని గుర్తించారు. తనకు కొన్ని రోజుల క్రితం నుంచి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసిందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..