Watch Video: శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నీటిలో చిక్కుకున్న కారు.. తప్పిన పెను ప్రమాదం..
శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం గేట్ల ద్వారా నాగార్జునసాగర్ కి నీరు తరలి వెళ్తున్న దృశ్యాలను చూసేందుకు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన పర్యాటకులకు ఈ పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు స్థానికుల సహాయంతో అందరినీ రక్షించగలిగారు
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం సమీపంలోని పాతాళ గంగ బ్రిడ్జ్ కింద పెనుప్రమాదం తృటిలో తప్పింది. వికారాబాద్ జిల్లా దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ, అతని స్నేహితులు నది స్నానాలకు కారును లింగలగట్టు పాతాళగంగ బ్రిడ్జి కింద ఆపి స్నానం చేయడానికి వెళ్లారు. అధికారులు డ్యామ్ గేట్లు మరిన్ని తెరవడంతో బ్రిడ్జి కిందున్న కారు నీటిలో మునగడం మొదలైంది. హఠాత్తుగా వరద ఉధృతి పెరగడంతో తమ కారు నీట మునగడాన్ని గమనించిన కృష్ణ, అతని స్నేహితులు షాక్‌కు గురైయ్యారు. వెంటనే స్థానిక మత్స్యకారులు, స్థానికుల సహాయంతో నీటితో చుట్టుముట్టిన కారును బయటకు తీయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు, ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది.
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

