Watch Video: వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్ చూశారా..?
శ్రీశైలం ప్రాజెక్టులో జల దృశ్యం ఇది. అద్భుత అపురూప సన్నివేశం ఇది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు, నిండు కుండలా మారింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దివి నుంచి భువికి ఆకాశ గంగ దూకినట్లు...అంతెత్తు నుంచి కృష్ణమ్మ ఉరకలు పెడుతూ కిందకు దూకుతున్న దృశ్యం...అందరిని ఆకట్టుకుంటోంది.
శ్రీశైలం ప్రాజెక్టులో జల దృశ్యం ఇది. అద్భుత అపురూప సన్నివేశం ఇది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు, నిండు కుండలా మారింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దివి నుంచి భువికి ఆకాశ గంగ దూకినట్లు…అంతెత్తు నుంచి కృష్ణమ్మ ఉరకలు పెడుతూ కిందకు దూకుతున్న దృశ్యం…అందరిని ఆకట్టుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. 6, 7, 8 గేట్ల ద్వారా 81 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలదృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు పోటెత్తారు. ఇక శ్రీశైలం గేట్ల నుంచి ఉరకలు వేస్తూ దూకుతున్న కృష్ణమ్మ.. వడివడిగా నాగార్జున సాగర్ వైపు దూసుకుపోతోంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 180 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. దీంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని వదులుతున్నారు.
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

