Srisailam: శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ సమావేశం.. భక్తుల కోసం తీసుకున్న కీలక నిర్ణయాలివే

శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి 21వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 3 గంటలపాటు సమావేశం కొనసాగింది. అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 30 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 28 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామన్నారు.

Srisailam: శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ సమావేశం.. భక్తుల కోసం తీసుకున్న కీలక నిర్ణయాలివే
Srisailam Trust Board Meeting

Edited By:

Updated on: Dec 13, 2023 | 6:32 AM

 

శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి 21వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 3 గంటలపాటు సమావేశం కొనసాగింది. అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 30 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 28 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. శ్రీశైలం పరివార ఆలయమైన శిఖరేశ్వరస్వామి వారి ఆలయ ప్రహారీగోడ పెంచి బండపరుపు వేసి,ఆర్చ్ గేట్ సీసీ రోడ్డుకు 49 లక్షలకు ఆమోదం తెలుపగ క్షేత్ర పరిధిలో పలు చోట్ల సీసీ రోడ్లు వెయ్యుటకు 29 లక్షలకు ప్రతిపాదించారు. భక్తుల సౌకర్యార్థం వసతి సౌకర్యార్థం 200 గదుల వసతి నిర్మాణనికి 52 కోట్ల అంచనా వేసి ఆమోదం తెలిపారు. క్షేత్రపరిధిలో ట్రాఫిక్,పార్కింగు సమస్య తగ్గించేందుకు టోలేట్, నందిసర్కిల్ ప్రీకాస్ట్ సెంటర్ డివైడర్లుకు ఏర్పాటు చేసేందుకు 38.50 లక్షలు ఆమోదం తెలిపామన్నారు. రాజుల సత్రం నుండి సిద్ధరామప్ప కొలను వరకు కొండలోయకు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన కూడా చేసి ఆమోదం చేశామని మల్లికార్జునసదన్ నుండి టోల్ గేట్ వరకు టోల్ గేట్ నుంచి రామయ్య టర్నింగ్ వరకు ఫ్లై ఓవరు బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే సిద్ధిరామప్ప జంక్షన్ రహదారి విస్తారణ అలానే కళ్యాణకట్ట మరమ్మతులకు 28.50 లక్షలు కేటాయించమన్నారు.

వీటితో పాటు రాబోయే శివరాత్రి,ఉగాది మహోత్సవాలను సివిల్, ఎలక్ట్రికల్, పండుగలకు పలు అభివృద్ధికి సంబంధించి 82 పనులకు 10 కోట్ల 54 లక్షలకు వరకు ఆమోదం తెలిపారని చైర్మన్‌ చక్రపాణి రెడ్డి తెలిపారు. క్షేత్ర ప్రచారంలో భాగంగా స్థలపురాణం,చరిత్ర, క్షేత్ర ప్రత్యేకతలను చిత్రాలతో కాఫీటేబుల్ బుక్ ప్రచురించేందుకు ఆమోదం తెలిపమని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజుతో పాటు సభ్యులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి