Srisailam: మల్లన్న ఆలయంలో అపచారం.. తప్పతాగి విధులకు హాజరైన ఉద్యోగి.. భక్తుల నిరసన

|

Aug 02, 2024 | 12:34 PM

కొంతమంది మాత్రం పుణ్య క్షేత్రంలో కూడా చెయ్యకూడని పనులు చేస్తూ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను మంట కలుపుతున్నారు. తాజాగా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది. మందు, మాంసాహారం నిషేధం అని తెలిసినా మల్లన్న ఆలయంలో మందు తాగి ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు. దీంతో భక్తులు అతడిని పట్టుకుని దేహశుద్ది చేశారు.

Srisailam: మల్లన్న ఆలయంలో అపచారం.. తప్పతాగి విధులకు హాజరైన ఉద్యోగి.. భక్తుల నిరసన
Srisailam
Follow us on

హిందూధర్మంలో పవిత్ర క్షేత్రాలకు, పూజలకు ప్రవిత్ర స్థానం ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రాల వద్ద, ఆలయాల వద్ద మద్యం తాగడం, సిగరెట్ తాగడం పవిత్రతకు భంగంగా భావిస్తారు. ఎవరైనా ఈ నియమాలను అతిక్రమిస్తే అపచారంగా భావిస్తారు. కనుకనే ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే భక్తులకు కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆలయం వద్ద విధులను నిర్వహించే సిబ్బంది కూడా వాటిని పాటించాలి. అయితే కొంతమంది మాత్రం పుణ్య క్షేత్రంలో కూడా చెయ్యకూడని పనులు చేస్తూ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను మంట కలుపుతున్నారు. తాజాగా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది. మందు, మాంసాహారం నిషేధం అని తెలిసినా మల్లన్న ఆలయంలో మందు తాగి ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు. దీంతో భక్తులు అతడిని పట్టుకుని దేహశుద్ది చేశారు.

గురువారం ఉదయం రాత్రి 9 గంటలకు మల్లన్న దర్శనం కోసం భక్తులు క్యూ కంపార్ట్మెంట్ లో ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భక్తులు ఆలయ క్యూ లైన్ దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని భక్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో భక్తులు అధికారిని ఉద్యోగి మద్యం తాగి వస్తే ఏమి చేస్తున్నారంటూ నిలదీశారు. ఆలయ పవిత్రతను పోగొడుతున్నారు అంటూ మండి పడ్డారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మద్యం తాగి విధులకు వస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజు ఆలయ ఈవో పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..