Andhra Prdesh: ఫోన్ పోయిందా.. డోంట్ వర్రీ.. ఇలా చేస్తే.. రూపాయి ఖర్చు లేకుండా వెనక్కి వచ్చేస్తుంది..

ఫోన్ అంటే కేవలం కాల్స్ కోసం మాత్రమే కాదు. ఇప్పుడు అన్నింటికీ ఫోనే. విలువైన పాస్‌వర్డ్స్ ఉంటాయ్... ఎన్నో మెమరీస్ ఉంటాయ్.. ఇంపార్టెంట్ డాక్యూమెంట్స్ ఉంటాయ్.. అలాంటి ఫోన్ పోతే..?

Andhra Prdesh: ఫోన్ పోయిందా.. డోంట్ వర్రీ.. ఇలా చేస్తే.. రూపాయి ఖర్చు లేకుండా వెనక్కి వచ్చేస్తుంది..
Recovered Mobile Phones
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 07, 2023 | 3:32 PM

వెయ్యికి పైగా చోరీకి గురైన సెల్‌ఫోన్లను కర్నూలు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఆశలు వదులుకున్న బాధితులు పోయిన ఫోన్లు ఒక్కసారిగా రావడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ అంది పుచ్చుకున్న కర్నూలు పోలీసులు చోరీకి గురైన సెల్‌ఫోన్లను సులభంగా గుర్తిస్తున్నారు. అంతే సులభంగా రికవరీ కూడా చేస్తున్నారు. ఇదివరకటిలాగా బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. కర్నూలు జిల్లా పోలీస్ వెబ్‌సైట్‌లో వివరాలు అప్లోడ్ చేస్తే.. రెండు నెలల్లోగా ఫోన్ రికవరీ అవుతుంది. ఇలా రికవరీ అయిన కోటిన్నర విలువైన వెయ్యికి పైగా సెల్‌ఫోన్లను బాధితులకు కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అందజేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే కాకుండా రాజస్ధాన్, ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసిన ఫోన్లు పోగొట్టుకున్నావారు. మొబైల్ ఫోన్ పోతే … మీ సేవా కేంద్రాల కు వెళ్ళి గాని, లేదా http://Kurnoolpolice.in/mobiletheft లింకును క్లిక్ చేసి మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన రికవరీ చేసిన ఫోన్లను అందజేసేందుకు కృషి చేస్తామంటున్నారు పోలీసులు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా కర్నూలు పోలీసులు అతి తక్కువ సమయంలోనే మూడవ విడతలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 1042 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ శనివారం బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు.

ప్రజలకు మంచి సేవలందించేందుకు సైబర్ టీమ్ బాగా పని చేస్తున్నారన్నారు ఎస్పీ. పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామన్నారు.  మొబైల్ మిస్సింగ్ గురించి ప్రజలు పోలీసు స్టేషన్‌లకు వెళ్లి.. ఫిర్యాదు చేయడం అసౌకర్యంగా ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో డిజిపి ఆదేశాల మేరకు సులభతరమైన పధ్ధతిలో మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే కర్నూలు పోలీసు మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్‌కి వెళ్ళి మొబైల్ ఫోన్ వివరాలు అందించవచ్చన్నారు. దానిపై వెంటనే సైబర్ ల్యాబ్ టీమ్ వర్క్ చేస్తుందని చెప్పారు. ఇప్పటివరకు 2 వేల 7 వందల మంది బాధితులకు సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు.

ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా సెల్ ఫోన్ పొగోట్టుకున్న బాధితుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కర్నూలు పోలీసు మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ కు మంచి స్పందన కూడా వస్తుందన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరి అయిన వాటి పరిష్కారంపై కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా కూడా కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి పొగోట్టుకున్న సెల్ ఫోన్ వివరాలు అందజేస్తే సెల్ ఫోన్ రికవరీ చేసేందుకు కృషి చేస్తామన్నారు.పర్సనల్ సమాచారం, జ్ఞాపకాలు, ఎన్నో మొబైల్ లో ఉంటాయని.. సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందని పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫోన్ పోయిందని ఆన్‌లైన్ ద్వారా ఎలా తెలియజేయాలంటే… 

//Kurnoolpolice.in/mobiletheft ఈ లింకు ను క్లిక్ చేసి ఆ వివరాలను సమర్పించండి. మీ మొబైలు ను తిరిగి పొందండి.

ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మొబైల్ LOST కాలమ్ నందు ఈ  మీ పేరు, మీ జిల్లా , మీ పోలీస్ స్టేషన్ పరిధి , మీ మొబైలు కు సంబంధించిన IMEI-1, IMEI- 2 వివరాలు , మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ /alternate కాంటాక్ట్ వివరాలు సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మీరు ఫిర్యాదు చేసినచో పోలీస్ వారు మీ మొబైలు ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 మీ – సేవా నందు ఎలా అప్లై చేయాలంటే….

బాధితులు తమకు దగ్గర్లోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ క్రింది వివరాలు అందించినట్లయితే మీ మొబైల్ ను పోలీసు వారు తిరిగి ఇప్పించటం కోసం ఈ క్రింది వివరాలను మీరు మీ -సేవా నందు ఇవ్వవలిసి ఉంటుంది.

• మీరు పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ వివరాలు

• మీరు పోగొట్టుకున్న మొబైలు/సెల్ ఫోన్ యొక్క IMEI వివరాలు

• మీరు పోగొట్టుకున్నప్పుడు ఉపయోగించిన మొబైలు నెంబర్ వివరాలు

• మీకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు కార్డ్ , చిరునామా ,పేరు మొదలగు వివరాలు మిమ్మల్ని సంప్రదించడానికి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నెంబర్, alternate కాంటాక్ట్ వివరాలు ఈ వివరాలు మీరు మీ-సేవా నందు సమర్పించి Missing /lost articles రుసుమును చెల్లించి , సదరు మీ-సేవా రసీదును తమ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇవ్వవలెను.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?