Devaragattu Fight: దేవరగట్టు కర్రల సమరం మొదలైంది.. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ

క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగే కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం ఇప్పుడే ప్రారంభమైంది. ప్రతి ఏటా జరిగే హింస ఈసారి కూడా జరుగుతుందా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతీ ఏడాదీ ఈ పండుగ నాడు కనీసం వంద మందికి తగ్గకుండా

Devaragattu Fight: దేవరగట్టు కర్రల సమరం మొదలైంది.. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ
Devaragattu
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 15, 2021 | 9:50 PM

Devaragattu: క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగే కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం ఇప్పుడే ప్రారంభమైంది. ప్రతి ఏటా జరిగే హింస ఈసారి కూడా జరుగుతుందా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతీ ఏడాదీ ఈ పండుగ నాడు కనీసం వంద మందికి తగ్గకుండా ప్రతి ఏటా తలలు పగులుతున్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయ్యాయి కర్నూలు కలెక్టర్ ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. కళ్ళెదుటే హింస జరుగుతుంటే , పోలీసులు నియంత్రించలేక పోయారు అంటూ నోటీసులో ప్రశ్నలు కురిపించింది. అయితే, నోటీసులు వస్తున్నాయి.. అయినా ప్రతి ఏటా దేవరగట్టులో హింస జరుగుతూనే ఉంది. ఈసారి కూడా అదే జరుగబోతుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయికూర్చుంది.

ఈ సాంప్రదాయం లోతుల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా హోలగొందా మండలం దేవరగట్టు లో ప్రతియేటా విజయదశమి రోజు అర్ధరాత్రి బన్ని ఫెస్టివల్ జరుగుతుంది. దీనినే ఇటీవలకాలంలో కర్రల సమరం కూడా పిలుస్తున్నారు. వందల ఏళ్ల క్రితం దేవరగట్టు లో వెలసిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలను కైవసం చేసుకునేందుకు దేవరగట్టు పరిసర ప్రాంతాలలో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. ఉత్సవ విగ్రహాలను కైవసం చేసుకునేందుకు రెండు వర్గాల మధ్య జరిగే సమరమే కర్రల సమరం. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు.

ఈ ఉత్సవంలో పాల్గొనే వేలాది మంది కర్రలు చేతపట్టి కర్రలతో చివర్లో ఇనుప చువ్వ బిగించి బన్నీ ఉత్సవం ఆడుతారు. ఈ ఉత్సవంలో కొందరు మద్యం సేవించి కూడా ఆడటానికి వస్తుండటంతో హింస జరుగుతోంది. తాగిన మైకంలో బన్నీ ఆడలేక కర్రలు ఇతరుల తలపై పడుతున్నాయి చివరి భాగంలో ఉన్న తగిలి తలలు పగులుతున్నాయి. వాస్తవంగా మెజారిటీ భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు కొందరి కారణంగానే తలలో పగులుతున్నాయి అనే వాదన వినిపిస్తోంది. బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుంచి మూడు నుంచి నాలుగు లక్షలకు పైగా జనం తరలివస్తారు.

ఈ రాత్రి జరిగుతోన్న ఈ ఉత్సవం చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పది రోజుల ముందు నుంచే పోలీసులు ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ఇంటిలో ఉన్న కర్రలను ఏరి పారేశారు. ఎక్కడైనా సరే నాటు సారా తయారవుతుంది అంటే తక్షణమే వెళ్లి నాటుసారా పార్టీలను ధ్వంసం చేశారు. అయినప్పటికీ భక్తి పరమైన అంశం అవడంతో సున్నితమైన అంశం కావడంతో రెండు వేల మందికి పైగా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. కలెక్టర్ కోటేశ్వరరావు కూడా ఆహారము నీరు విద్యుత్ వైద్యం ఫైర్ హాస్పిటల్ తదితర అధికారులతో మాట్లాడి అక్కడే ఉండేలా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ చిన్న జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అయితే, మొత్తం మీద స్థానికంగా ఉండే ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు ముఖ్యంగా భక్తి భావం పెంపొందించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి వస్తుందని ఇప్పుడు మార్చాలని పోలీసులు ఎంత ప్రయత్నించినా కనుచూపు మేరలో కనిపించడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Read also: భక్తులు పరమ పవిత్రంగా భావించే చిన్నజీయర్ స్వామి వారి తిరునక్షత్రం మహోత్సవం నవంబరు 4 నుంచి..