Vedic Village in AP : ఆ గ్రామంలో నో మైబైల్, నో టీవీ.. కనీసం కరెంట్ కూడా లేదు.. గీతను అనుసరించి వైదిక జీవితం.. విదేశీయలు కూడా స్థిర నివాసం

|

Jan 01, 2023 | 9:12 PM

ఇక్కడి ప్రజలు సర్వస్వం త్యజించారు. 200 ఏళ్ల నాటి వైదిక జీవతాన్ని గడుపుతున్నారు. భౌతిక  సౌకర్యాలు లేవు. ఈ గ్రామస్థులు సాదాసీదాగా జీవిస్తారు.  ఉన్నతంగా ఆలోచిస్తారు. గ్రామ ప్రజలు ఈ ఆలోచనతోనే జీవిస్తున్నారు. కృష్ణుడికి తమ జీవితాలను అంకితం చేసిన కొన్ని కుటుంబాలు ఈ  గ్రామంలో నివసిస్తున్నాయి.

Vedic Village in AP : ఆ గ్రామంలో నో మైబైల్, నో టీవీ.. కనీసం కరెంట్ కూడా లేదు.. గీతను అనుసరించి వైదిక జీవితం.. విదేశీయలు కూడా స్థిర నివాసం
Vedic Village Kurmagrama
Follow us on

ప్రపంచం ఆధునిక యుగంలో పయనిస్తుంది. అయితే ఆ గ్రామంలో 5జీ కాలంలో కరెంటు కూడా లేదు. ఇంటర్నెట్ అవసరం లేదు. అసలు ఆ గ్రామంలో  ఎవరికీ మొబైల్ కూడా లేదు. వంటగది నుండి పడకగది వరకు ఎలక్ట్రికల్ పరికరాలు లేవు. ఆహారాన్ని ఎల్‌పిజి గ్యాస్‌పై కాకుండా స్టవ్‌పై వండుతారు. వినోద సాధనాలు లేవు. టీవీ లేదు, రేడియో లేదు. ఎవరైనా ఎక్కడివారితోనైనా మాట్లాడాలనుకుంటే.. ఆ గ్రామం మొత్తానికి ఒకే ఒక బేసిక్ ఫోన్ ఇన్‌స్టాల్ చేయబడింది. అది ల్యాండ్‌లైన్ ఫోన్. అయితే ఈ గ్రామంలో అత్యంత పేదరికంతో ఉంది అనుకుంటే అది పూర్తిగా తప్పు. ఆ ఊరి ప్రజలు పేదరికం వల్ల ఇంటర్నెట్ కాలంలో కూడా ఇలా బతుకుతున్నారని కాదు.. ఇక్కడి ప్రజలు సర్వస్వం త్యజించారు. 200 ఏళ్ల నాటి వైదిక జీవతాన్ని గడుపుతున్నారు. భౌతిక  సౌకర్యాలు లేవు. ఈ గ్రామస్థులు సాదాసీదాగా జీవిస్తారు.  ఉన్నతంగా ఆలోచిస్తారు. గ్రామ ప్రజలు ఈ ఆలోచనతోనే జీవిస్తున్నారు. కృష్ణుడికి తమ జీవితాలను అంకితం చేసిన కొన్ని కుటుంబాలు ఈ  గ్రామంలో నివసిస్తున్నాయి.

సూర్యోదయానికి ముందే దినచర్య ప్రారంభం
ఈ గ్రామం పేరు కూర్మగ్రామం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. నగరం నుండి దాదాపు 6 కి.మీ. లో ఉన్న ఈ గ్రామాన్ని ఐటీ హబ్‌గా పిలుస్తారు.  విదేశీయులకు ఈ గ్రామం పర్యాటక ప్రాంతంలా ఉంటుంది. ఇక్కడి ప్రజల ఇళ్లు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన లార్డ్ షరీముఖ్ లింగేశ్వర దేవాలయం తరహాలో నిర్మించబడ్డాయి.

ప్రజలు తమ జీవితాన్ని ఉదయం 3:30 గంటలకు ప్రారంభిస్తారు. అంతేకాదు సాయంత్రం 7:30 గంటలకు నిద్రపోతారు. తాము తినే ధాన్యాలు , కూరగాయలు అన్నీ స్వయంగా పండించుకుంటారు. ఇక్కడ వ్యవసాయం కాకుండా.. ఆవులను కూడా పెంచుతారు. వీటి పాలను తినే ఆహారంలో చేర్చుకుంటారు. అంతేకాదు ఆవు పేడతో పిడకలు చేసి.. వాటిని పొయ్యలో వేసి.. మండించి ఆహారం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు వేసుకునే బట్టలు కూడా తామే నేసుకుంటారు. ఎవరిపైనా ఆధారపడరు.

ఇవి కూడా చదవండి

గీత నుండి ప్రేరణ, వేద యుగం వంటి జీవితం
ఇక్కడి గురుకుల అధిపతి నటేశ్వర్ నరోత్తమ్ దాస్..  భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దాని ఆధారంగా గ్రామస్థులు తమ జీవితాలను గడుపుతున్నారని చెప్పారు. ఈ గ్రామానికి చెందిన రాధాకృష్ణ చరణ్ దాస్ చదువు తర్వాత ఐటీలో ఉద్యోగంలో చేరాడు. అయితే కృష్ణుడి భక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇప్పుడు ఈ గ్రామంలో ఉపాధ్యాయుడు.

వైదిక సంప్రదాయం ప్రకారం గురుకుల విద్య 
గ్రామంలో అన్ని సబ్జెక్టులు బోధించే గురుకులం ఉంది. గణితం, సైన్స్, సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, కళలు… అన్నీ. దీనితో పాటు పిల్లలకు నైతిక విద్యను కూడా అందిస్తున్నారు. తెల్లవారుజామున మంగళ హారతి, మంత్రాలతో ధ్యానం చేసి చదువులు ప్రారంభిస్తారు. పిల్లలకు కూడా హిందూ గ్రంథాలు బోధిస్తారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యం కాబట్టి దీనికి కూడా ఇక్కడ చాలా ఏర్పాట్లు ఉన్నాయి. కబడ్డీ నుంచి స్విమ్మింగ్ వరకు.. అన్ని రకాల క్రీడలు పిల్లలకు అందుబాటులో ఉన్నాయి.

ఈ గ్రామంలో పర్యటించే విదేశీయులు :

ఇక్కడి ప్రజలు తమ గ్రామం వెలుపల లేదా ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతున్నా పట్టించుకోరు. అయితే బయటి నుంచి వచ్చే వారి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. గ్రామం పేరుగాంచడంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వైదిక పద్ధతిలో జీవిస్తున్న ఈ గ్రామానికి విదేశీయులు కూడా వస్తుంటారు. కొందరు విదేశీయులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..