Kondapalli Municipal Election: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి.. ఫలితం తేలాలంటే వేచి చూడాల్సిందే..

|

Nov 24, 2021 | 12:44 PM

నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. అలాగే ఇద్దరు వైస్ చైర్మన్‌ల ఎన్నిక కూడా ముగిసింది.

Kondapalli Municipal Election: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి.. ఫలితం తేలాలంటే వేచి చూడాల్సిందే..
Kondapalli Municipal Electi
Follow us on

Kondapalli Municipal Election: నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. అలాగే ఇద్దరు వైస్ చైర్మన్‌ల ఎన్నిక కూడా ముగిసింది. హైకోర్ట్ ఆదేశాలతో ఫలితం మాత్రం అధికారులు వెల్లడించలేదు. టీడీపీకి 16 ఓట్లు పడితే..వైసీపీకి 15 ఓట్లు వచ్చాయి. ఎక్స్‌ఆఫిషియో వివాదాన్ని హైకోర్టు తేల్చనుంది. ఎన్నికపై ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొంది. అయితే ఒక్కొక్కరుగా కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. చైర్మన్‌ ఎన్నిక సజావుగానే ముగిసింది. అయితే వైస్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై మాత్రం తర్జనభర్జనలు జరిగాయి.

చైర్మన్‌ బీసీకి కేటాయించడంతో వైస్‌ చైర్మన్‌లు ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థికి కేటాయించాలని ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయి. ఫైనల్‌గా వైస్‌ చైర్మన్ల ఎంపిక కూడా అధికారులు పూర్తి చేశారు. ఇక ఫలితం తేలాలంటే హైకోర్ట్‌ ఆదేశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.

ఇదిలావుంటే.. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఘర్షణతో రెండ్రోజులుగా ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. అయితే హైకోర్ట్‌ ఆదేశాలతో ఇవాళ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగింది.

మంగళవారం రోజు టీడీపీ, వైసీపీకి సమానంగా ఓట్లు రావడంతో ఎక్స్‌ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఐతే టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓటు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది వైసీపీ. ఐతే కేశినేని నాని ఓటు వేసేందుకు అనుమతిచ్చిన కోర్టు.. ఎన్నిక నిర్వహించి ఫలితాలను మాత్రం వెల్లడించొద్దని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి: ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..