Konaseema: గల్ఫ్ ఏజెంట్ మోసాలకు బలైన కోనసీమ మహిళలు జైలులో కటకటాలు లెక్కపెడుతున్నారు. మూడు నెలలుగా 30 మంది మహిళలు కేరళ జైల్లో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాలకు పంపిస్తామని లక్షల రూపాయల తీసుకుని నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంట్ బారిన పడ్డ మహిళలు చివరికి జైలు పాలయ్యారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం కునవరం కు చెందిన ఏజెంట్ రాంబాబు గల్ఫ్ దేశాలకు పంపుతానంటూ అమాయక మహిళలను బురిడీ కొట్టించాడు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలను శంషాబాద్ విమానాశ్రయం అటు నుంచి కేరళ తీసుకెళ్లి దేశం దాటిచ్చేందుకు ప్రయత్నించాడు. ఇమిగ్రేషన్ చెకింగ్ లో నకిలీ విసాలను గుర్తించిన అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ చైర్‌పర్సన్ భవాని చొరవతో ఐదుగురికి కండీషీన్ బెయిలయితే తీసుకొచ్చారు. తమను ఆదుకోవాలంటూ టీవీ9 కు పంపిన సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతం అయ్యారు మహిళలు. తమవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..