Konaseema: అంతర్వేదిలో మత్సకారుల పంట పడిందిగా.. వలకు చిక్కిన భారీ టేకు చేప.. బరువు ఎంతో తెలిస్తే షాక్..

| Edited By: Surya Kala

Aug 19, 2024 | 10:46 AM

భారీ టేకు చేపను చూసి మత్స్యకారులు షాక్ తిన్నారు. ఒడ్డుకు చేర్చడం వారి తరం కాకపోవటంతో క్రేన్ సాయంతో ఈ బాహుబలి చేపను ఒడ్డుకు తీసుకువచ్చారు. భారీ చేప వలలో చిక్కిందని తెలియగానే.. చుట్టు పక్కల ఉన్న జనం ఈ చేపను చూడటానికి ఎగబడ్డారు. ఈ టేకు చేపలు అరుదుగా వలలో పడతాయని మత్స్యకారులు చెప్పారు.

Konaseema: అంతర్వేదిలో మత్సకారుల పంట పడిందిగా.. వలకు చిక్కిన భారీ టేకు చేప.. బరువు ఎంతో తెలిస్తే షాక్..
Teku Fish
Follow us on

కోనసీమ జిల్లా అంతర్వేదిలో మత్సకారులకు భారీ టేకు చేప చిక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా వేములదీవికి చెందిన బలంగం వేంకటేశ్వర్లు బోటుపై కాకినాడ మత్స్యకారులు అంతర్వేది సముద్రతీరంలోకి చేపల వేటకు వెళ్లగా.. భారీ టేకు చేప వలకు చిక్కింది. సుమారు 1800 కేజీల టేకు చేపను చూసి మత్స్యకారులు షాక్ తిన్నారు. ఒడ్డుకు చేర్చడం వారి తరం కాకపోవటంతో క్రేన్ సాయంతో ఈ బాహుబలి చేపను ఒడ్డుకు తీసుకువచ్చారు. భారీ చేప వలలో చిక్కిందని తెలియగానే.. చుట్టు పక్కల ఉన్న జనం ఈ చేపను చూడటానికి ఎగబడ్డారు. ఈ టేకు చేపలు అరుదుగా వలలో పడతాయని మత్స్యకారులు చెప్పారు. అంతర్వేదిలో ఇంత పెద్ద చేప వలకు చిక్కడం ఇదే మొదటిసారి అన్నారు. దీని ధర తక్కువలో తక్కువ మూడు లక్షలు రూపాయలు పలుకుతుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..