Andhra: ఆ టికెట్‌తో ఒక్క రూపాయ్ చెల్లించక్కర్లేదు.. ఫ్రీ బస్సు టికెట్ ఎలా ఉంటుందో తెల్సా

ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం రేపటి నుంచే ప్రారంభం కానుంది. స్వాతంత్ర దినోత్సవ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ' స్త్రీ శక్తి' పథకం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది సర్. ఎందుకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణా తరగతులు కూడా పూర్తయ్యాయి.

Andhra: ఆ టికెట్‌తో ఒక్క రూపాయ్ చెల్లించక్కర్లేదు.. ఫ్రీ బస్సు టికెట్ ఎలా ఉంటుందో తెల్సా
Ap Free Bus

Edited By:

Updated on: Aug 14, 2025 | 11:02 AM

ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం రేపటి నుంచే ప్రారంభం కానుంది. స్వాతంత్ర దినోత్సవ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ‘ స్త్రీ శక్తి’ పథకం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది సర్. ఎందుకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణా తరగతులు కూడా పూర్తయ్యాయి. టికెట్లు ఇష్యూ చేసే టిమ్ మిషన్లలో సాఫ్ట్వేర్న కూడా అప్డేట్ చేశారు. ఉమెన్ ఫ్రీ టికెట్ (WFT) అనే ఆప్షన్ను ప్రత్యేకంగా జోడించారు. మరి ఈ ఫ్రీ టికెట్ ఎలా ఉంటుందో తెలుసా..?

ఎస్.! ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు స్త్రీ శక్తి పథకంలో భాగంగా డబ్బులు చెల్లించనవసరం లేదు. సూపర్ లగ్జరీ, ఏసి, ఘాట్రోడ్లో వెళ్లే బస్సులతో పాటు మరికొన్ని సర్వీసుల మినహా అన్ని బస్సుల్లోనూ మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రంలోని ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఈ బస్సుల్లో మహిళలు ప్రయాణించి డబ్బులు చెల్లించనవసరం లేదు. ఇప్పటికే విశాఖతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ఆర్టీసీ కండక్టర్లకు శిక్షణ పూర్తయింది. ఇప్పటికే టికెట్లు జారీ చేస్తున్న టిమ్ మిషన్ల సాఫ్ట్వేర్న కూడా అప్డేట్ చేశారు. రేపు విశాఖ మద్దిలపాలెం బస్సు డిపోలో.. రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఉచిత బస్సు పథకం శ్రీ శక్తిని ప్రారంభిస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

జీరో ఫేర్ టికెట్ ఇదే..!

మహిళల ఉచిత బస్సు ప్రయాణం పై టికెట్ ఇష్యూ చేసే విధానాన్ని ఇప్పటికే సిబ్బందికి ఆర్టీసీ శిక్షణ ఇచ్చింది. ఉచిత ప్రయాణం వర్తించే బస్సుల్లో.. జీరో ఫెర్ టికెట్ ను కండక్టర్లు ఇష్యూ చేస్తారు. ఈ టికెట్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరుతో లోగో, దీంతోపాటు బస్సు డిపో పేరు, తేదీ, సర్వీస్ పేరు ఉంటుంది. అలాగే మహిళల ఉచిత బస్సు పథకం ‘స్త్రీ శక్తి’ పేరు ప్రత్యేకంగా టికెట్ పై కనిపిస్తుంది. అలాగే ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది స్టేజెస్ కూడా టికెట్ పై కనిపిస్తాయి. దీంతోపాటు ఆ ప్రయాణానికి అయ్యే మొత్తం ధర, ప్రభుత్వ రాయితీ, చెల్లించవలసినది.. అని ప్రత్యేకంగా ముద్రించబడి ఉంటుంది. ఉదాహరణకు.. మినిమం టికెట్ పది రూపాయలు అయితే.. జీరో ఫెర్ టికెట్ లో మొత్తం టికెట్ ధర రూ.10.00 ఉంటుంది. దాని కింద వరుసలో ప్రభుత్వ రాయితీ రూ. 10.00 అని ముద్రించబడి ఉంటుంది. దాని కింద.. చెల్లించవలసినది రూ.0.00 అని క్లియర్ గా టికెట్ పై ప్రింట్ అయి వస్తుంది. అప్పుడే అది జీరో ఫెయిర్ టికెట్ గా పరిగణించాల్సి ఉంటుంది. ఆ టికెట్ మీ చేతికి అందగానే రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. జీరో ఫెయిర్ టికెట్ తో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అనుమతించిన బస్సుల్లో మహిళలు ప్రయాణించవచ్చు. అలాగే ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు పథకం అవకాశం కల్పించింది ప్రభుత్వం.