Vizag: తెల్లారి పొలానికి వెళ్లిన రైతు.. నీళ్లు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయగా.. ఆ తర్వాత సీన్ ఇది
అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరినాగు తీవ్ర కలకలం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. విమాడుగుల శివారులోని పొలాల్లో కింగ్ కోబ్రా హడాలెత్తించింది. ఓ రైతు పొలాల్లోని మోటార్ రూమ్‌లో.. కింగ్ కోబ్రా కనిపించింది. చెక్క పెట్టెలో తిష్ట వేసి శబ్దాలు చేస్తోంది.
అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరినాగు తీవ్ర కలకలం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. విమాడుగుల శివారులోని పొలాల్లో కింగ్ కోబ్రా హడాలెత్తించింది. ఓ రైతు పొలాల్లోని మోటార్ రూమ్‌లో.. కింగ్ కోబ్రా కనిపించింది. చెక్క పెట్టెలో తిష్ట వేసి శబ్దాలు చేస్తోంది. ఏమిటా అని ఆరా తీసేసరికి.. వడగ విప్పి నిటారుగా నిల్చుంది. దీంతో ఆ కుటుంబం గుండెలు పట్టుకుని పరుగులు తీసింది. ఆ తర్వాత విషయాన్ని అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి సంరక్షకుడికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన వన్యప్రాణి సంరక్షకుడు వెంకట్ పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. పెట్టెలో దాక్కున్న కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. చివరకు గంటపాటు శ్రమించి కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత పట్టుకున్న కింగ్ కోబ్రాను అడవుల్లో విడిచిపెట్టారు.
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!

