Andhra Pradesh: కొనసాగుతున్న పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్.. వైసీపీ – టీడీపీ నేతల్లో ఉత్కంఠ..
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికను వైసీపీ - టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ, పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి. ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్స్ అమలుచేశాయి. దీంతో గెలుపు ఎవరిదీ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. కడప ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పులివెందుల ZPTC కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక రౌండ్‌లోనే పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తికానుంది. ఒంటిమిట్ట జడ్పీటీసీ కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో ఒంటిమిట్ట జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తికానుంది. ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.
కాగా పులివెందుల ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం జడ్పీటీసీ ఎన్నిక మినీ సంగ్రామాన్ని తలపించింది. గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ వంటివి జరిగాయి. ఈ ఎన్నికను వైసీపీ – టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ, పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి. ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్స్ అమలుచేశాయి. టీడీపీ నుంచి లతా రెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి ఉపఎన్నిక బరిలో నిలిచారు. దీంతో గెలుపు ఎవరిదీ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
