
Note to Vote Case: ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణలో కీలక విషయాలు వెలువడుతున్నాయి. ప్రధాన నిందితుడు మత్తయ్య వాంగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేసింది. ఇందులో చంద్రబాబు డైరెక్టన్‌లోనే రేవంత్ రెడ్డితో కలిసి స్టీఫెన్ సన్‌ను ప్రలోభపెట్టినట్టు మత్తయ్య ఒప్పుకున్నాడు. స్టీఫెన్ సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడం కోసం డీల్ మాట్లాడినట్లు మత్తయ్య ఈడీ విచారణలో అంగీకరించాడు. సెబాస్టియన్‌ను సంప్రదించి డీల్ ఓకే చేసినట్టు తెలిపాడు. టీడీపీకి ఓటు వేస్తే ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని ఎన్నికల నుంచి తప్పుకుంటే 3 కోట్లు ఇస్తామని డీల్ మాట్లాడినట్టు మత్తయ్య అంగీకరించాడు. డీల్ సెట్ చేసినందుకు 50 లక్షల ఆఫర్ ఇచ్చారని ఒప్పుకున్నాడు. లోకేశ్ సలహా మేరకు ఏపీకి వెళ్లానని ఈడీకి మత్తయ్య తెలిపారు.