టీడీపీ, వైసీపీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలుంటాయి. ఇది రోజు బీజేపీ నేతలు చెప్పే మాటలు. అయితే శనివారం రోజు ఈ మాట రోజూ చెప్పేదే అయినా.. ఏడు.. ఎనిమిది మందిని మాత్రం బీజేపీలోకి చేర్చుకోబోమన్నారు. ఇక టీడీపీ పార్టీ.. త్వరలో బీజేపీలో విలీనం అవుతుందని.. చంద్రబాబు అవసరం మోదీకి ఉందన్న జేసీ ప్రభాకార్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి.. కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. అసలు చంద్రబాబు అవసరం టీడీపీకే లేదన్న అభిప్రాయంతొ కొంత మంది నేతలు ఉన్నారని.. ఇక ఆయన అవసరం బీజేపీకి ఎందుకు ఉంటుందన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాలపై కాకుండా, అమల్లోకి కూడా వస్తే బాగుంటదని అభిప్రాయపడ్డారు.