AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాపింగ్‌కు అని చెప్పి.. రాత్రివేళ ప్రియుడితో వెళ్లింది.. ఆ తర్వాత ఊహించని ఘటన..

ప్రేమించిన యువతిని చంపి.. ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఏపీలో కలకలం రేపింది.. షాపింగ్‌కి అని వెళ్లిన ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు .. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

షాపింగ్‌కు అని చెప్పి.. రాత్రివేళ ప్రియుడితో వెళ్లింది.. ఆ తర్వాత ఊహించని ఘటన..
Crime News
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Oct 01, 2025 | 4:34 PM

Share

ప్రేమించిన యువతిని చంపి.. ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఏపీలో కలకలం రేపింది.. షాపింగ్‌కి అని వెళ్లిన ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు .. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ప్రేమికుల మృతి కలకలం రేపింది.. కాకినాడ జిల్లా సామర్లకోట మండల పరిధిలోని పనసపాడు గాడేరు కాలువ గట్టుపై పదిహేడేళ్ళ మైనర్ బాలికను హత్య చేసి హుస్సేన్ పురం సమీపంలోని రైలు కిందపడి 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన బాలిక కాకినాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజు బస్సులో వెళ్లొచ్చేది. బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్న సమయం నుండి అదే గ్రామానికి చెందిన యువకుడికి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది. రెండ్రోజుల పాటు వీకెండ్ ఎగ్జామ్స్ ఉన్నాయని కాకినాడలోని బాలిక పెదనాన్న ఇంటికి వెళ్ళింది. బాలిక మంగళవారం సాయంత్రం నుండి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తెలిసిన చోట్ల వెతికారు.

అయితే ఈరోజు ఉదయం బాలికను హత్య చేశారన్న విషయం తెలుసుకున్న బంధువులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. బాలిక హత్యపై విచారణ చెయ్యాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను అత్యంత కిరాతకంగా బ్లేడుతో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే బాలికను ప్రేమిస్తున్న అశోక్ సామర్లకోట మండలం గూడపర్తి సమీపంలో అశోక్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో బాలికను అశోక్ చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. ఇద్దరిదీ హత్యనా..? లేదంటే కావాలని ఆత్మహత్య చేసుకున్నారా..? అనే కోణంలో పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, బాలిక మంగళవారం సాయంత్రం షాపింగ్ కోసం కాకినాడ వెళ్లిందని.. ఆమెను యువకుడు బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. బ్యాంకులకు కీలక ఆదేశాలు..
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. బ్యాంకులకు కీలక ఆదేశాలు..