ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు భద్రత పెంచుతున్నట్లు కడప జిల్లా సిద్ధార్థ కౌశల్ తెలిపారు. నిన్నటి వరకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్ భద్రత ఉన్న వైఎస్ షర్మిలకు ఇప్పుడు టు ప్లస్ టు గన్‌మెన్ భద్రతను కల్పిస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. తన అభ్యర్థన మేరకే భద్రత పెంచామని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అన్నారు. వై.ఎస్ షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ నుండి టూ ప్లస్ టూగా భద్రత పెంచామని చెప్పారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల డీజీపీకి చేసిన అభ్యర్థన మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. అందుకే ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్‌మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూగా పెంచడం జరిగిందని తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారులు ఇచ్చే సిఫారసు నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ వివరించారు.
అయితే గతంలో టూ ప్లస్ టు గన్‌మెన్ ఉన్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆమెకు ఏపీ నుంచి ఇస్తున్న భద్రతను వన్ ప్లస్ వన్‌గా చేశారు. కడపలో ఆమెకు మొదటి నుంచి టూ ప్లస్ టూ భద్రతను ఇచ్చారు. ఎప్పుడైతే తెలంగాణ వెళ్లి అక్కడ పార్టీ పెట్టారో అప్పటి నుంచే టు ప్లస్ టు ఉన్న భద్రతను వన్ ప్లస్ వన్‌గా కదించినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలలోకి ఎక్కువగా వెళుతున్నారు. అందుకే షర్మిలకు వన్ ప్లస్ వన్ నుంచి టు ప్లస్ టు భద్రత కల్పించామని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఇద్దరు గన్మెన్లను కూడా కడప జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచే ఇవ్వనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..